యశోద షూటింగ్ అప్ డేట్స్
సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరి-హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ నెల 6న `యశోద` చిత్రీకరణ మొదలుపెట్టారు. నిన్నటితో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. సమంతతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా […]
సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరి-హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశారు.
ఈ నెల 6న 'యశోద' చిత్రీకరణ మొదలుపెట్టారు. నిన్నటితో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. సమంతతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులపై హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. ప్రముఖ నటులు రావు రమేష్, మురళీ శర్మ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించనున్నారు.
జనవరి 3న రెండో షెడ్యూల్ ప్రారంభించి 12 వరకూ చేయబోతున్నారు. మూడో షెడ్యూల్ జనవరి 20 నుంచి మార్చి 31 వరకూ ఏకథాటిగా జరుగుతుంది. దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఏక కాలంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.