తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు..
ఒమిక్రాన్ ప్రభావంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షల చక్రబంధంలోకి వెళ్లిపోయాయి. కర్నాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు ఉన్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి తెలంగాణ కూడా చేరింది. హైకోర్టు సూచనలతో తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చింది. ఈ ఆంక్షలు ఈనెల 31నుండి మొదలై జనవరి-2 వరకు కొనసాగుతాయని ప్రకటించారు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్. విపత్తు నిర్వహణచట్టం కింద ఆంక్షలు అమలులో ఉంటాయని […]
ఒమిక్రాన్ ప్రభావంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షల చక్రబంధంలోకి వెళ్లిపోయాయి. కర్నాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు ఉన్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి తెలంగాణ కూడా చేరింది. హైకోర్టు సూచనలతో తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చింది. ఈ ఆంక్షలు ఈనెల 31నుండి మొదలై జనవరి-2 వరకు కొనసాగుతాయని ప్రకటించారు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్.
విపత్తు నిర్వహణచట్టం కింద ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. డిసెంబర్ 31నుంచి జనవరి 2వరకు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగసభలపై నిషేధం ఉంటుంది. జనం గుమికూడే కార్యక్రమాలకు అనుమతి తప్పనిసరి. అక్కడ కూడా టెంపరేచర్ చెకింగ్, థర్మల్ స్క్రీనింగ్ ఉండాల్సిందే. ఇక మాస్క్ లేకుండా బయట తిరిగేవారినుంచి కచ్చితంగా వెయ్యి రూపాయల జరిమానా వసూలు చేయాలని కూడా ఆదేశాలిచ్చారు. గతంలో ఈ నిబంధన ఉన్నా.. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని, ఇప్పుడు కచ్చితంగా జరిమానా వసూలు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలతో.. వ్యాపార వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే యువత కొత్త సంవత్సరం వేడుకలకు సిద్ధమైపోయింది. చాలా చోట్ల హోటళ్లు, రెస్టారెంట్లు కూడా పెద్ద పెద్ద ఈవెంట్స్ కి ప్లాన్ చేసుకున్నాయి. తాజా మార్గదర్శకాలతో వారికి ఇబ్బంది ఎదురయ్యే అవకాశముంది. యువత కూడా ఈ ఆంక్షలతో దిగాలు పడింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని ఫుల్ జోష్ తో జరుపుకోవాలనుకున్నవారంతా.. పరిమిత పాస్ లు, మాస్క్ లు, సామాజిక దూరం.. అంటూ ఆంక్షలు పెట్టే సరికి షాకయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో నింపాదిగా ఉన్నా కూడా హైకోర్టు సూచనలతో కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధపడక తప్పలేదు.