డ్యూటీ మొదలుపెట్టిన రామారావు
ఇలా షూటింగ్ మొదలుపెట్టి, అలా ఫినిషింగ్ స్టేజ్ కు వచ్చింది రామారావు ఆన్ డ్యూటీ. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రచారాన్ని ఇవాళ్టి నుంచి మొదలుపెట్టారు. క్రిస్మస్ సందర్భంగా సినిమా యూనిట్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది. రవితేజ యాక్షన్ ప్యాక్డ్ రోల్‌లో కనిపించబోతోన్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో రవితేజ ఎంతో కూల్‌గా కనిపిస్తున్నారు. రవితేజ చేస్తోన్న సాయం, అది అందుకున్న వారి కళ్లలో ఆనందం పోస్టర్‌లొ కనిపిస్తోంది. దివ్యాంశ […]
ఇలా షూటింగ్ మొదలుపెట్టి, అలా ఫినిషింగ్ స్టేజ్ కు వచ్చింది రామారావు ఆన్ డ్యూటీ. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రచారాన్ని ఇవాళ్టి నుంచి మొదలుపెట్టారు. క్రిస్మస్ సందర్భంగా సినిమా యూనిట్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది.
రవితేజ యాక్షన్ ప్యాక్డ్ రోల్‌లో కనిపించబోతోన్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో రవితేజ ఎంతో కూల్‌గా కనిపిస్తున్నారు. రవితేజ చేస్తోన్న సాయం, అది అందుకున్న వారి కళ్లలో ఆనందం పోస్టర్‌లొ కనిపిస్తోంది. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.
మాస్ మహారాజా రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో శరత్ మాండవ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. శ్యామ్ సీఎస్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.