Telugu Global
Cinema & Entertainment

రికార్డ్ సృష్టించిన రాధేశ్యామ్ ట్రయిలర్

ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా రిలీజైంది ట్రయిలర్. ఇప్పుడీ ట్రయిలర్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. సినిమాపై ఉన్న అంచనాలకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన వస్తుంది. ఒక్క రోజులోనే ఈ చిత్ర ట్రైలర్ 64 మిలియన్ వ్యూస్ అందుకుని ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసింది. డిసెంబర్ 23న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అభిమానులే […]

Radhe Shyam Movie
X

ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా రిలీజైంది ట్రయిలర్. ఇప్పుడీ ట్రయిలర్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. సినిమాపై ఉన్న అంచనాలకు సజీవ సాక్ష్యంగా నిలిచింది.

ఈ మధ్యే విడుదలైన ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన వస్తుంది. ఒక్క రోజులోనే ఈ చిత్ర ట్రైలర్ 64 మిలియన్ వ్యూస్ అందుకుని ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసింది. డిసెంబర్ 23న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అభిమానులే అతిథులుగా రాధే శ్యామ్ ట్రైలర్ విడుదల చేసారు. లవ్ స్టోరీతో పాటు యాక్షన్, సస్పెన్స్, డ్రామా, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ ట్రైలర్‌లో ఉన్నాయి. 5 భాషలకు సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తుంది.

ఈ సినిమా కోసం చాలామంది సంగీత దర్శకులు పని చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్, నార్త్ వెర్షన్స్‌కు సంబంధించి సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయబోతున్నారు.

First Published:  25 Dec 2021 2:16 PM IST
Next Story