పవన్ కల్యాణ్ గ్యాప్ ఇవ్వరంట
హీరో పవన్ కల్యాణ్ ఇకపై తన కెరీర్ కు గ్యాప్ ఇవ్వరంట. 2024 ఎన్నికల కోసం ఏడాది ముందుగానే సినిమాలన్నీ పూర్తిచేసి, రాజకీయ రణరంగంలోకి దూకుతారని అంతా అనుకున్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం మరోసారి సినిమాలకు గ్యాప్ ఇచ్చే ఆలోచనలో లేరని తెలుస్తోంది. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేసే పనిలో పవన్ బిజీగా ఉన్నారు. ఎన్నికల టైమ్ కు ఎన్ని వీలైతే అన్ని సినిమాలు కంప్లీట్ చేస్తారు. ఓ 6 నెలలు గ్యాప్ ఇచ్చి, […]
హీరో పవన్ కల్యాణ్ ఇకపై తన కెరీర్ కు గ్యాప్ ఇవ్వరంట. 2024 ఎన్నికల కోసం ఏడాది ముందుగానే సినిమాలన్నీ పూర్తిచేసి, రాజకీయ రణరంగంలోకి దూకుతారని అంతా అనుకున్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం మరోసారి సినిమాలకు గ్యాప్ ఇచ్చే ఆలోచనలో లేరని తెలుస్తోంది.
ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేసే పనిలో పవన్ బిజీగా ఉన్నారు. ఎన్నికల టైమ్ కు ఎన్ని వీలైతే అన్ని సినిమాలు కంప్లీట్ చేస్తారు. ఓ 6 నెలలు గ్యాప్ ఇచ్చి, ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత తిరిగి కొత్త షెడ్యూల్స్ మొదలుపెడతారు.
ఓవైపు పవన్, ఎన్నికలు-రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ.. మరోవైపు ఆయన పేరిట సినిమా నిర్మాణం జరగనుంది. పవన్ గ్యాప్ తీసుకున్న టైమ్ లో ఆయన మనుషులు, పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై పీపుల్ మీడియాతో కలిసి కొన్ని సినిమాలు నిర్మించే ప్లానింగ్ లో ఉన్నారు.
ఇలా గ్యాప్ ఇవ్వకుండా కెరీర్ ను కొనసాగించాలనుకుంటున్నారు పవన్ కల్యాణ్. ఓవైపు రాజకీయాలు చేస్తూనే, మరోవైపు సినిమాల్లో కొనసాగాలని అనుకుంటున్నారట. అయితే దీనిపై పవన్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దానికింకా టైమ్ ఉంది.