Telugu Global
National

ప్రశాంత్ కిషోర్ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్.. ఏదో జరుగుతోంది..?

ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్ సంస్థ అధినేత ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీతోనూ, ఏ నాయకుడితోనూ ఎక్కువరోజులు కలసి పనిచేయలేదు. మొదట్లో మోదీ, ఆ తర్వాత నితీష్ కుమార్, మధ్యలో రాహుల్.. ఇలా చాలామందితో కలసి పనిచేసి మధ్యలోనే విభేదాలతో బయటకొచ్చి తనదారి తాను చూసుకున్నారు. తాజాగా ఆయనకు తృణమూల్ కాంగ్రెస్ కు మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ విజయం కోసం ఆయన కృషిచేశారు. అయితే ఆ విజయాన్నంతా ఆయన తన ఖాతాలోనే […]

ప్రశాంత్ కిషోర్ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్.. ఏదో జరుగుతోంది..?
X

ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్ సంస్థ అధినేత ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీతోనూ, ఏ నాయకుడితోనూ ఎక్కువరోజులు కలసి పనిచేయలేదు. మొదట్లో మోదీ, ఆ తర్వాత నితీష్ కుమార్, మధ్యలో రాహుల్.. ఇలా చాలామందితో కలసి పనిచేసి మధ్యలోనే విభేదాలతో బయటకొచ్చి తనదారి తాను చూసుకున్నారు. తాజాగా ఆయనకు తృణమూల్ కాంగ్రెస్ కు మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ విజయం కోసం ఆయన కృషిచేశారు. అయితే ఆ విజయాన్నంతా ఆయన తన ఖాతాలోనే వేసుకోవడం టీఎంసీ నేతలకు నచ్చలేదు. టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రియెన్ లాంటి నేతలు బహిరంగంగానే ప్రశాంత్ కిషోర్ పై విమర్శలు సంధించారు. ఐ-ప్యాక్‌ తమకు రాజకీయ సలహదారు ఏజెన్సీ మాత్రమేనని, పార్టీ ఎదుగుదలకు సలహాలు ఇచ్చేందుకు ఐదేళ్లపాటు ఒప్పందం కుదుర్చుకున్నాం తప్ప అంతకుమించి సంబంధమేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆ ఏజెన్సీ, దాని ప్రతినిధులు తమ పార్టీ తరఫున మాట్లాడకుండా వాళ్లకు అప్పగించిన పని పూర్తి చేస్తే చాలు అని కూడా అన్నారు. ఏజెన్సీ పనితీరును టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ అంచనా వేస్తారని తెలిపారు. వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్న వేళ.. సడన్ గా ప్రశాంత్ కిషోర్ ని తీసిపడేసినట్టు టీఎంసీ ఎంపీ మాట్లాడటం సంచలనంగా మారింది. టీఎంసీ ఎదుగుదలకు తానే కారణం అంటూ ప్రశాంత్ కిషోర్ ఫోజు కొడుతున్నారనే భావన కూడా ఆ పార్టీ నేతల్లో ఉంది. దీంతో డెరిక్ ఓబ్రియెన్ బహిరంగంగానే ఈ వ్యవహారంపై స్పందించారు.

విభేదాలు మొదలైనట్టు పుకార్లు..
టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రియెన్ వ్యాఖ్యలతో ప్రశాంత్ కిషోర్, టీఎంసీ స్నేహం చెడిపోయిందని పుకార్లు మొదలయ్యాయి. గోవా సహా ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ తరపున పీకే టీమ్ పనిచేసే ప్రసక్తే లేదని కూడా ప్రచారం మొదలైంది. అయితే అంతలోనే టీఎంసీ సర్దుబాటు చేసుకుంది. పార్టీ తరపున క్లారిటీ ఇచ్చేసింది.

విభేదాల్లేవు..
తృణమూల్‌ కాంగ్రెస్‌, ప్రశాంత్‌ కిషోర్‌ కు చెందిన ఐ-ప్యాక్‌ కు మధ్య ఎలాంటి విభేదాల్లేవని.. తామంతా ఒకటే టీమ్‌ అని స్పష్టంచేసింది టీఎంసీ. ఈమేరకు పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ స్టేట్ మెంట్ విడుదల చేసింది. తమ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్టు వస్తోన్న ఊహాగానాలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. మమతా బెనర్జీ సారథ్యంలో అంతా కలిసి ఒకే టీమ్‌ గా పనిచేస్తామని, భవిష్యత్తులో పరస్పర సహకారం కొనసాగుతుందని స్పష్టంచేసింది.

First Published:  23 Dec 2021 9:40 PM
Next Story