శ్యామ్ సింగరాయ్ రిలీజ్ కష్టాలు
ఆంధ్రప్రదేశ్ థియేటర్లపై ప్రభుత్వం జరుపుతున్న దాడులతో శ్యామ్ సింగరాయ్ సినిమాకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. రేపు రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో థియేటర్లు దొరకని పరిస్థితి. థియేటర్ల యాజమాన్యాలు అన్ని రూల్స్ పాటిస్తున్నారా లేదా టాక్సులు సరిగ్గా కడుతున్నారా లేదా అనే అంశాలపై తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు.. వరుసగా సినిమా హాళ్లు సీజ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లాలోని పలు థియేటర్లపై దాడులు నిర్వహించిన అధికారులు.. కొన్ని థియేటర్ యాజమాన్యాలు ట్యాక్సులు చెల్లించలేదని […]
ఆంధ్రప్రదేశ్ థియేటర్లపై ప్రభుత్వం జరుపుతున్న దాడులతో శ్యామ్ సింగరాయ్ సినిమాకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. రేపు రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో థియేటర్లు దొరకని పరిస్థితి. థియేటర్ల యాజమాన్యాలు అన్ని రూల్స్ పాటిస్తున్నారా లేదా టాక్సులు సరిగ్గా కడుతున్నారా లేదా అనే అంశాలపై తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు.. వరుసగా సినిమా హాళ్లు సీజ్ చేస్తున్నారు.
కృష్ణా జిల్లాలోని పలు థియేటర్లపై దాడులు నిర్వహించిన అధికారులు.. కొన్ని థియేటర్ యాజమాన్యాలు ట్యాక్సులు చెల్లించలేదని గుర్తించారు. తగ్గించిన టికెట్ రేట్లను అమలు చేయకపోవడంతో పాటు.. భద్రతాచర్యలు, క్యాంటీన్ నడిపించే విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు. దీంతో 15 థియేటర్లు సీజ్ చేశారు. మరో 2 థియేటర్లకు ఫైన్లు విధించారు.
ఈ చర్యలకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 50 థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు. అటు విజయనగరం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా పలు థియేటర్లు మూతపడ్డాయి. అధికారుల తనిఖీలకు భయపడి కొందరు, స్వచ్ఛందంగా మరికొందరు థియేటర్లు మూసేశారు.
తాజా పరిణామాలు శ్యామ్ సింగరాయ్ విడుదలకు పెద్ద అడ్డంకిగా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో నాని సినిమా విడుదల కావడం లేదు. అసలే తక్కువ టికెట్లు రేట్లు, బెనిఫిట్ షోలు, అదనపు షోలు లేవు. ఇప్పుడు ఏకంగా థియేటర్లు కూడా మూసేయడం నానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది.