Telugu Global
International

జపాన్ లో పాల కష్టాలు.. ఇష్టం లేకపోయినా తాగాల్సిందే..!

ఆహార పదార్థాల వృథాను అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. కొన్నిసార్లు ప్రతిఫలం ఉండదు. భారత్ లో ప్రతి ఏటా ఎఫ్.సి.ఐ గోదాముల్లో మిగిలిపోయిన ధాన్యం ఎవరికీ పనికి రాకుండా వృథా అవుతుంది. దాదాపుగా అన్నిచోట్లా ఈ సమస్య ఉంది. ఇలాంటి సందర్భాల్లో మీరు ఫలానా పంటను వేయొద్దు, ఫలానా ఉత్పత్తిని తగ్గించండి అంటూ ప్రభుత్వం నేరుగా రైతులకు చెప్పి లేనిపోని తలనొప్పులు కొనితెచ్చుకోవడం కూడా చూస్తున్నాం. అయితే జపాన్ ప్రధాని మాత్రం వినియోగంపై దృష్టి పెట్టారు. […]

జపాన్ లో పాల కష్టాలు.. ఇష్టం లేకపోయినా తాగాల్సిందే..!
X

ఆహార పదార్థాల వృథాను అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. కొన్నిసార్లు ప్రతిఫలం ఉండదు. భారత్ లో ప్రతి ఏటా ఎఫ్.సి.ఐ గోదాముల్లో మిగిలిపోయిన ధాన్యం ఎవరికీ పనికి రాకుండా వృథా అవుతుంది. దాదాపుగా అన్నిచోట్లా ఈ సమస్య ఉంది. ఇలాంటి సందర్భాల్లో మీరు ఫలానా పంటను వేయొద్దు, ఫలానా ఉత్పత్తిని తగ్గించండి అంటూ ప్రభుత్వం నేరుగా రైతులకు చెప్పి లేనిపోని తలనొప్పులు కొనితెచ్చుకోవడం కూడా చూస్తున్నాం. అయితే జపాన్ ప్రధాని మాత్రం వినియోగంపై దృష్టి పెట్టారు. ఆ దేశంలో పాల నిల్వలు వృథా అయిపోతున్నాయనే ఉద్దేశంతో ప్రజలంతా ప్రతి రోజూ ఓ కప్పు అదనంగా పాలు తాగాలని సూచించారు.

ఈ చలికాలంలో జపాన్ లో 50లక్షల లీటర్ల పాలు వృథా అవుతాయని అంచనా. సహజంగా ఈ సీజన్లో జపాన్ లో పాలకు డిమాండ్ తక్కువగా ఉంటుంది. కొత్త సంవత్సర వేడుకలకోసం చాలా చోట్ల సూపర్ మార్కెట్ల ఓనర్లు షాపులు మూసేసి వెకేషన్ కు వెళ్తున్నారు. దీంతో పాల ఉత్పత్తుల మార్కెటింగ్ కూడా తగ్గిపోయింది. పాల నిల్వలు ఎక్కడికక్కడ డైరీల్లోనే పేరుకు పోతున్నాయి. దీన్ని అరికట్టాలంటే ప్రజలంతా రోజూ ఓ కప్పు పాలు అదనంగా తాగాలంటున్నారు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా. ఈమేరకు పార్లమెంట్ లో ఓ ప్రకటన విడుదల చేశారు.

జపాన్ లో స్కూల్ పిల్లల స్నాక్స్ లో పాలు కూడా ఒక భాగం. అయితే ఇటీవల కొవిడ్ కారణంగా సెలవలు రావడంతో పిల్లలకు ఇంటి వద్ద పాలు తాగే అలవాటు తప్పింది. ఇలా రకరకాల కారణాల వల్ల జపాన్ లో పాలకు డిమాండ్ తగ్గడంతో నిల్వలు పెరిగిపోతున్నాయి. ఈ వృథాను అరికట్టాలంటే జనవరి 3 వరకు ప్రజలంతా అదనంగా రోజూ మరో కప్పు పాలు తాగాల్సిందే. జపాన్ లో 1 లీటర్ పర్ డే.. అనే హ్యాష్ ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని వ్యాపార సంస్థలు డిసెంబర్ 31, జనవరి 1న పాల ధరలో 50 శాతం డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించాయి. మొత్తమ్మీద జపాన్ లో పాల వృథాను అరికట్టడానికి ప్రధాని నేరుగా ప్రజలను బతిమిలాడుకోవాల్సి వస్తోంది.

First Published:  23 Dec 2021 3:12 AM IST
Next Story