ధనుష్ తొలి తెలుగు సినిమా 'సర్'
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై, ధనుష్ హీరోగా సినిమా ఎనౌన్స్ అయింది. తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న ఈ సినిమాకు తాజాగా టైటిల్ ఎనౌన్స్ చేశారు. తమిళ వెర్షన్‌కు ‘వాతి’, తెలుగు వెర్షన్‌కు ‘సార్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సందర్భంగా పోస్టర్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ ప్రకారం ధనుష్ ఒక జూనియర్ కాలేజీ లెక్చరర్‌గా నటించనున్నారని తెలుస్తోంది. టైటిల్ డిజైన్‌లో పెన్నుపాళీ కనిపిస్తోంది. అంటే ఇది ఒక పీరియాడికల్ […]
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై, ధనుష్ హీరోగా సినిమా ఎనౌన్స్ అయింది. తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న ఈ సినిమాకు తాజాగా టైటిల్ ఎనౌన్స్ చేశారు. తమిళ వెర్షన్‌కు ‘వాతి’, తెలుగు వెర్షన్‌కు ‘సార్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సందర్భంగా పోస్టర్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ మోషన్ పోస్టర్ ప్రకారం ధనుష్ ఒక జూనియర్ కాలేజీ లెక్చరర్‌గా నటించనున్నారని తెలుస్తోంది. టైటిల్ డిజైన్‌లో పెన్నుపాళీ కనిపిస్తోంది. అంటే ఇది ఒక పీరియాడికల్ మూవీ అనీ, హీరో తన కలం బలంతో స్టూడెంట్స్‌కు ఒక రోల్ మోడల్ అవుతాడనీ ఊహించవచ్చు. మొత్తంగా ఈ మోషన్ పోస్టర్‌ను చూస్తుంటే, ఒక ఉద్వేగభరితమైన, ఉత్తేజకరమైన కథను దర్శక నిర్మాతలు మన ముందు ప్రెజెంట్ చేయనున్నారనే నమ్మకం కలుగుతోంది.
ఇదే బ్యానర్‌లో ఇటీవల ‘రంగ్‌దే’ చిత్రానికి దర్శకత్వం వహించిన వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ నిర్మాత కాగా.. త్రివిక్రమ్ భార్య సాయిసౌజన్య సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కేరళకు చెందిన చార్మింగ్ సెన్సేషన్ సంయుక్తా మీనన్ ఇందులో హీరోయిన్. జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతోంది.