Telugu Global
Health & Life Style

ఒమిక్రాన్ లక్షణాలేంటి.. ఇది ప్రమాదకరం కాదా?

చాపకింద నీరులా ఒమిక్రాన్ మెల్లగా వ్యాపిస్తుంది. అయితే దీని లక్షణాల విషయంలో ఇప్పటికీ ఓ స్పష్టత లేదు. ఇది ప్రమాదకరమైనదా లేదా అనే విషయాన్ని సైంటిస్టులు కూడా క్లియర్ గా చెప్పలేకపోతున్నారు. ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. ఒమిక్రాన్ కు ప్రపంచమంతటా భయపడడానికి కారణం దాని వ్యాప్తి. ఇది డెల్టా వేరియంట్ కంటే చురుగ్గా వ్యాపిస్తుంది. కానీ ఇంతకుముందు వేరియంట్లతో పోలిస్తే ఇది ప్రమాదకరమా కాదా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. లక్షణాలు భిన్నం ఈ […]

ఒమిక్రాన్ లక్షణాలేంటి.. ఇది ప్రమాదకరం కాదా?
X

చాపకింద నీరులా ఒమిక్రాన్ మెల్లగా వ్యాపిస్తుంది. అయితే దీని లక్షణాల విషయంలో ఇప్పటికీ ఓ స్పష్టత లేదు. ఇది ప్రమాదకరమైనదా లేదా అనే విషయాన్ని సైంటిస్టులు కూడా క్లియర్ గా చెప్పలేకపోతున్నారు. ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉంటాయంటే..

ఒమిక్రాన్ కు ప్రపంచమంతటా భయపడడానికి కారణం దాని వ్యాప్తి. ఇది డెల్టా వేరియంట్ కంటే చురుగ్గా వ్యాపిస్తుంది. కానీ ఇంతకుముందు వేరియంట్లతో పోలిస్తే ఇది ప్రమాదకరమా కాదా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు.

లక్షణాలు భిన్నం
ఈ క్రమంలోనే ఈ వేరియంట్ తీవ్రత‌తో పాటు ఇది సోకితే వ‌చ్చే ల‌క్షణాల‌పై అధ్యయ‌నం చేశారు సైంటిస్టులు. ఇప్పటివరకూ ఉన్న క‌రోనా వైర‌స్ వేరియంట్లన్నీ ప్రధానంగా శ్వాస వ్యవ‌స్థపై దాడి చేసేవి. ముక్కు లేదా నోటి ద్వారా శ‌రీరంలోకి ప్రవేశించి ఊపిరితిత్తుల్లోకి చేరేవి. దాంతో ఊపిరి ఆడకపోవడం, శ్వాస ఇబ్బందులు తలెత్తేవి. అయితే ఒమిక్రాన్ వేరియంట్ మాత్రం ఊపిరితిత్తుల‌కు చేర‌కుండా గొంతులోనే ఆగిపోతుంద‌ని సైంటిస్టులు చెప్తున్నారు. అందుకే దీని లక్షణాలు భిన్నంగా ఉంటాయంటున్నారు.

లక్షణాలివే..
ఒమిక్రాన్ వైర‌స్ సోకిన వారిలో ముఖ్యంగా గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ వంటివి ఎక్కువ‌గా ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. వీటితోపాటు కొందరిలో త‌ల‌నొప్పి, అల‌స‌ట వంటి ల‌క్షణాలు కూడా క‌నిపిస్తున్నాయి. కానీ ఒమిక్రాన్ సోకిన వారిలో ద‌గ్గు, తీవ్ర జ్వరం, వాస‌న, రుచి కోల్పోవ‌డం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి ల‌క్షణాలు మాత్రం కనిపించడంలేదు.

ప్రమాదం తక్కువ
మిగతా వేరియంట్లతో పోలిస్తే.. ఒమిక్రాన్ వేరియంట్ 7 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందనేది వాస్తవం. కానీ ఈ వేరియంట్ వాటంత ప్రభావం మాత్రం చూపించ‌డం లేదు. వైర‌స్ గొంతులోనే ఆగిపోవ‌డం వ‌ల్ల శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు త‌లెత్తట్లేదు. ఆక్సిజ‌న్ అందించాల్సిన అవ‌స‌రం కూడా రావట్లేదు. అందుకే ఈ వేరియంట్ తో మ‌ర‌ణాల రేటు కూడా త‌క్కువ‌గా ఉంటోంది.

First Published:  22 Dec 2021 3:13 AM GMT
Next Story