Telugu Global
National

పాకిస్తాన్ లోనూ రోడ్డెక్కిన పంజాబ్ రైతులు..

భారత్ లో రైతు ఉద్యమం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. రైతుల దెబ్బకి కేంద్రం దిగొచ్చి నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకుంది. ఈ క్రమంలో భారత రైతుల ఉద్యమ స్ఫూర్తి పాకిస్తాన్ కి కూడా పాకింది. అక్కడ కూడా రైతులు ప్రభుత్వంపై పోరాటం మొదలు పెట్టారు. గోధుమలకు మద్దతు ధరతోపాటు, వ్యవసాయానికి కరెంటు బిల్లులు తగ్గించాలంటూ డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. విచిత్రం ఏంటంటే.. అక్కడ కూడా పంజాబ్ రైతులే ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. ఢిల్లీలో […]

పాకిస్తాన్ లోనూ రోడ్డెక్కిన పంజాబ్ రైతులు..
X

భారత్ లో రైతు ఉద్యమం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. రైతుల దెబ్బకి కేంద్రం దిగొచ్చి నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకుంది. ఈ క్రమంలో భారత రైతుల ఉద్యమ స్ఫూర్తి పాకిస్తాన్ కి కూడా పాకింది. అక్కడ కూడా రైతులు ప్రభుత్వంపై పోరాటం మొదలు పెట్టారు. గోధుమలకు మద్దతు ధరతోపాటు, వ్యవసాయానికి కరెంటు బిల్లులు తగ్గించాలంటూ డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. విచిత్రం ఏంటంటే.. అక్కడ కూడా పంజాబ్ రైతులే ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమానికి పంజాబ్ రైతులు నాయకత్వం వహిస్తే.. పాకిస్తాన్ లో కూడా పంజాబ్ ప్రావిన్స్ రైతులే అక్కడి ప్రభుత్వాన్ని హడలెత్తిస్తున్నారు.

పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అక్కడ నిత్యావసర వస్తువుల రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి. అదే సమయంలో రైతులకు మాత్రం గిట్టుబాటు ధరలు లభించడంలేదు. దళారీల వల్ల అటు ప్రభుత్వానికి ఆదాయం రావడంలేదు, ఇటు రైతులు లాభపడటంలేదు. దీంతో గోధుమ పండించే రైతులు గిట్టుబాటు ధరకోసం పాకిస్తాన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. సానుకూల స్పందన లేకపోవడంతో రోడ్డెక్కి నిరసనలు మొదలు పెట్టారు. పాకిస్తాన్ కిసాన్ ఇత్తెహాద్ సంస్థ ఆధ్వర్యంలో అక్కడ రైతు పోరాటం ముందుకు సాగుతోంది.

లాహోర్ చుట్టూ భద్రతా వలయం..
ఆందోళనకారులు లాహోర్ ని చుట్టుముట్టే ప్రయత్నం చేయడంతో అక్కడి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. దాదాపుగా 2వేలమంది రైతుల్ని ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాహోర్ వైపు వచ్చేవారిని అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ కిసాన్ ఇత్తెహాద్ నేత‌ల సార‌థ్యంలో ఓ బృందం స్థానిక అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపింది. అవి విఫ‌లం కావడంతో త‌మ ఉద్య‌మాన్ని తీవ్ర‌త‌రం చేస్తున్నామ‌ని రైతు సంఘం ప్ర‌తినిధులు ప్ర‌క‌టించారు. పంజాబ్ ప్రావిన్స్ లో రైతులు బ్యాన‌ర్లు చేత ప‌ట్టుకొని, ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డెక్కారు. మొత్తమ్మీద భారత్ లోని పంజాబ్ రైతుల స్ఫూర్తితో పాకిస్తాన్ లో కూడా పంజాబ్ ప్రావిన్స్ రైతులు ఉద్యమం తీవ్రతరం చేస్తున్నారు. గోధుమలకు మద్దతుధర, కరెంటు చార్జీల తగ్గింపుకోసం పోరాటం చేస్తున్నారు.

First Published:  21 Dec 2021 11:08 PM GMT
Next Story