Telugu Global
Cinema & Entertainment

బోయపాటి దర్శకత్వంలో మోక్షజ్ఞ?

ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న హాట్ గాసిప్ ఇది. అఖండ విజయంతో బాలకృష్ణ మనసు మారిందట. కొడుకు కెరీర్ ను బోయపాటి చేతిలో పెట్టాలని నిర్ణయించాడట. మంచి ముహూర్తం చూసి మోక్షజ్ఞ-బోయపాటి కాంబోలో సినిమాను ఎనౌన్స్ చేస్తారనే ప్రచారం నందమూరి అభిమానుల సోషల్ మీడియా సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. స్వీయ దర్శకత్వంలో కొడుకును వెండితెరకు పరిచయం చేయాలనుకున్నారు బాలయ్య. దీనికోసం ఆదిత్య-369 సీక్వెల్ ను ఎంచుకున్నారు. కథ కూడా రాస్తున్నట్టు ప్రకటించారు. కానీ అది ఎప్పటికీ […]

బోయపాటి దర్శకత్వంలో మోక్షజ్ఞ?
X

ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న హాట్ గాసిప్ ఇది. అఖండ విజయంతో బాలకృష్ణ మనసు మారిందట. కొడుకు కెరీర్ ను బోయపాటి చేతిలో పెట్టాలని నిర్ణయించాడట. మంచి ముహూర్తం చూసి మోక్షజ్ఞ-బోయపాటి కాంబోలో సినిమాను ఎనౌన్స్ చేస్తారనే ప్రచారం నందమూరి అభిమానుల సోషల్ మీడియా సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది.

స్వీయ దర్శకత్వంలో కొడుకును వెండితెరకు పరిచయం చేయాలనుకున్నారు బాలయ్య. దీనికోసం ఆదిత్య-369 సీక్వెల్ ను ఎంచుకున్నారు. కథ కూడా రాస్తున్నట్టు ప్రకటించారు. కానీ అది ఎప్పటికీ కార్యరూపం దాల్చలేదు. బాలయ్య ఇతర సినిమాలతో బిజీ అయిపోయారు. ఈలోగా అఖండ హిట్టవ్వడంతో, బాలయ్య మనసు మారినట్టు తెలుస్తోంది.

తనకున్న మాస్ ఇమేజ్ ను కొడుక్కి కూడా కట్టబెట్టేందుకు బోయపాటి అయితేనే కరెక్ట్ అని బాలకృష్ణ భావిస్తున్నారట. అయితే ఓ కొత్త నటుడ్ని, బోయపాటి ఇప్పటివరకు హ్యాండిల్ చేయలేదు. పైగా అతడి కథల్ని మోయడానికి చిన్న హీరోలు, కొత్త హీరోలు పనికిరారు. పైగా అఖండ తర్వాత బోయపాటి మరింత బిజీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఈ గాసిప్ నిజమౌతుందా.. పుకారుగానే ఉండిపోతుందా అనేది చూడాలి.

First Published:  22 Dec 2021 3:11 PM IST
Next Story