Telugu Global
Cinema & Entertainment

చిత్తూరుపై ప్రేమ కురిపించిన బన్నీ

పుష్ప సినిమాలో చిత్తూరు యాసలో మాట్లాడాడు బన్నీ. అతడి యాక్టింగ్ తో పాటు చిత్తూరు యాసలో చెప్పిన డైలాగ్ డెలివరీకి మంచి గుర్తింపు వచ్చింది. అందుకే తన సినిమా సక్సెస్ మీట్ ను తిరుపతిలో పెట్టాడు బన్నీ. చిత్తూరు ప్రజలపై తనకున్న అభిమానాన్ని బయటపెట్టాడు. “రెండు సంవత్సరాలుగా చిత్తూరు గురించి బాగా తెలుసుకుంటున్నాను. ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారు.. వాళ్ళ భాష యాస ఎలా ఉంటుంది.. అనేది అన్ని నేర్చుకున్నాను. ఇవన్నీ చూసిన తర్వాత ఈ సినిమాకు […]

చిత్తూరుపై ప్రేమ కురిపించిన బన్నీ
X

పుష్ప సినిమాలో చిత్తూరు యాసలో మాట్లాడాడు బన్నీ. అతడి యాక్టింగ్ తో పాటు చిత్తూరు యాసలో చెప్పిన డైలాగ్ డెలివరీకి మంచి గుర్తింపు వచ్చింది. అందుకే తన సినిమా సక్సెస్ మీట్ ను తిరుపతిలో పెట్టాడు బన్నీ. చిత్తూరు ప్రజలపై తనకున్న అభిమానాన్ని బయటపెట్టాడు.

“రెండు సంవత్సరాలుగా చిత్తూరు గురించి బాగా తెలుసుకుంటున్నాను. ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారు.. వాళ్ళ భాష యాస ఎలా ఉంటుంది.. అనేది అన్ని నేర్చుకున్నాను. ఇవన్నీ చూసిన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఒక్క ఈవెంట్ అయినా చిత్తూరులో పెట్టాలి అనుకున్నాము. అనుకున్నట్టుగానే మొదటి ఫంక్షన్ ఇక్కడ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా చేసిన తర్వాత చిత్తూరు భాష, ప్రజలపై అభిమానం మరింత పెరిగింది.”

చిత్తూరు ప్రజల వెనక ఏడుకొండల స్వామి ఎలాగైతే ఉన్నాడో.. తన వెనక సుకుమార్ అలా ఉన్నాడని చెప్పుకొచ్చాడు బన్నీ. అన్ని భాషల్లో పుష్ప సినిమా సూపర్ సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందన్నాడు. విజయోత్సవ సభలో చాలా జోష్ తో మాట్లాడాడు బన్నీ. పుష్ప సినిమాలో పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పి అందర్నీ ఆకర్షించాడు. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. బయటకు చెబుతున్న కలెక్షన్లపై మాత్రం విమర్శలు వినిపిస్తున్నాయి.

First Published:  22 Dec 2021 3:13 PM IST
Next Story