శ్యామ్ సింగరాయ్ కథ చెప్పిన దర్శకుడు
శ్యామ్ సింగరాయ్ సినిమాతో ఈ వీకెండ్ థియేటర్లలోకి రాబోతున్నాడు దర్శకుడు రాహుల్ సంకృత్యాన్. సైన్స్ ఫిక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన ఈ దర్శకుడు.. శ్యామ్ సింగరాయ్ కథలో కూడా అలాంటి అంశాలున్నాయని ప్రకటించాడు. స్టోరీ లైన్ ను కూడా కొద్దిగా బయటపెట్టాడు. “స్క్రీన్ ప్లే పరంగా, విజువల్ పరంగా ఈ సినిమా కొత్తగా ఉంటుంది. ఫస్టాఫ్‌లో వాసు క్యారెక్టర్, కృతిశెట్టితో లవ్‌స్టోరీ చాలా బాగుంటాయి. అందులో ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ ఉంది. దానిలో నుంచి ఒక సూపర్ […]
శ్యామ్ సింగరాయ్ సినిమాతో ఈ వీకెండ్ థియేటర్లలోకి రాబోతున్నాడు దర్శకుడు రాహుల్ సంకృత్యాన్. సైన్స్ ఫిక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన ఈ దర్శకుడు.. శ్యామ్ సింగరాయ్ కథలో కూడా అలాంటి అంశాలున్నాయని ప్రకటించాడు. స్టోరీ లైన్ ను కూడా కొద్దిగా బయటపెట్టాడు.
“స్క్రీన్ ప్లే పరంగా, విజువల్ పరంగా ఈ సినిమా కొత్తగా ఉంటుంది. ఫస్టాఫ్‌లో వాసు క్యారెక్టర్, కృతిశెట్టితో లవ్‌స్టోరీ చాలా బాగుంటాయి. అందులో ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ ఉంది. దానిలో నుంచి ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఉంటుంది. అలా ఒక్కో అంశం డెవలప్ అవుతూ కథ సాగుతుంది.”
నిజానికి నానితో సినిమా కోసం ముందుగా అనుకున్న కథ ఇది కాదంట. ఓ సబ్జెక్ట్ రిజెక్ట్ అయిన తర్వాత, శ్యామ్ సింగరాయ్ కథ రాసినట్టు తెలిపాడు రాహుల్.
“నాని గారితో గతంలో ఒక సబ్జెక్ట్ గురించి చర్చించాను. అది కుదరలేదు. కాని ఆయన ఎలాంటి కథల మీద ఇంట్రెస్ట్‌గా ఉంటారని ఒక ఐడియా ఉంది. ఈ సబ్జెక్ట్ చెప్పగానే ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఒకే చేశారు. అప్పటి నుండే నన్ను నమ్మడం మొదలైంది… ఈ రోజు వరకూ ఆ నమ్మకం పెరుగుతూనే వస్తుంది తప్ప ఎక్కడా తగ్గలేదు. ఆయన సపోర్ట్ వల్లే ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయగలిగాను.”
శ్యామ్ సింగరాయ్ సినిమాలో సాయిపల్లవి, కృతిషెట్టి, మడొన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.