Telugu Global
Cinema & Entertainment

కీరవాణిపై రాజమౌళి రియాక్షన్ ఇది

రాజమౌళి-కీరవాణిని విడదీసి చూడలేం. ఇద్దరూ ఒక్కటే. రాజమౌళి ఓ సినిమా చేస్తే దానికి కీరవాణి సంగీతం అందించాల్సిందే. ఒకే కుటుంబం కాబట్టి కీరవాణిని కంటిన్యూ చేయడం లేదంట రాజమౌళి. తన సినిమాకు బెస్ట్ ఇస్తున్నాడు కాబట్టే రిపీట్ చేస్తున్నాడట. కీరవాణి కంటే మరొకరు బెస్ట్ ఇస్తారనే నమ్మకం తనకు కలిగిన రోజున, కీరవాణిని పక్కనపెట్టి.. ఆ సంగీత దర్శకుడి వెంట పడతానని అన్నాడు. ఇలా కీరవాణిపై తనకున్న అభిప్రాయాన్ని బయటపెట్టాడు రాజమౌళి. మరోవైపు కీరవాణి కూడా రాజమౌళితో […]

కీరవాణిపై రాజమౌళి రియాక్షన్ ఇది
X

రాజమౌళి-కీరవాణిని విడదీసి చూడలేం. ఇద్దరూ ఒక్కటే. రాజమౌళి ఓ సినిమా చేస్తే దానికి కీరవాణి సంగీతం అందించాల్సిందే. ఒకే కుటుంబం కాబట్టి కీరవాణిని కంటిన్యూ చేయడం లేదంట రాజమౌళి. తన సినిమాకు బెస్ట్ ఇస్తున్నాడు కాబట్టే రిపీట్ చేస్తున్నాడట. కీరవాణి కంటే మరొకరు బెస్ట్ ఇస్తారనే నమ్మకం తనకు కలిగిన రోజున, కీరవాణిని పక్కనపెట్టి.. ఆ సంగీత దర్శకుడి వెంట పడతానని అన్నాడు.

ఇలా కీరవాణిపై తనకున్న అభిప్రాయాన్ని బయటపెట్టాడు రాజమౌళి. మరోవైపు కీరవాణి కూడా రాజమౌళితో తనకు జరిగే గొడవల్ని బయటపెట్టాడు. క్రియేటివ్ సైడ్ లో ఇద్దరి మధ్య ఎప్పుడూ యుద్ధాలు జరుగుతుంటాయని తెలిపాడు.

“ఆర్ఆర్ఆర్ ట్రయిలర్ కు నేనొక మ్యూజిక్ అనుకున్నాను. అది రాజమౌళికి అప్పుడు నచ్చింది, చాలామంది అభిప్రాయం తీసుకున్న తర్వాత మాత్రం నచ్చలేదు, మార్చమన్నాడు. నేను అలిగాను. చివరికి రాజమౌళి పంతమే నెగ్గింది. మార్చక తప్పలేదు. ట్రయిలర్ రాజమౌళిదే, టైటిల్స్ లో మాత్రం నా పేరు వేసుకున్నాను.”

వీళ్లిద్దరి మధ్య ఇంత అనుబంధం ఉంది కాబట్టే సినిమాల్లో సంగీతం కూడా ఆ స్థాయిలో అద్భుతంగా వస్తోంది. ఆర్ఆర్ఆర్ పాటల కోసం చాలా కష్టపడ్డానని ప్రకటించిన కీరవాణి, ఆ కష్టంలో సగం క్రెడిట్ ను రాజమౌళికి కూడా ఇస్తానంటున్నాడు.

First Published:  19 Dec 2021 12:35 PM IST
Next Story