Telugu Global
Cinema & Entertainment

సినిమా టికెట్ల పంపిణీ పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

ఏపీలో ఆన్ లైన్ టికెటింగ్ విధానం అమల్లోకి తీసుకొస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల కింద ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం తగ్గించింది. బెనిఫిట్ షోలను కూడా రద్దు చేసింది. తగ్గిన సినిమా టిక్కెట్ల ధరల పై ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇదిలా ఉండగా టిక్కెట్లను ఆన్లైన్లోనే ప్రభుత్వం విడుదల చేస్తుందని.. ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. ఈ విధానం అమలు కావడంలో కొంత ఆలస్యమైంది. ఇటీవల బాలకృష్ణ హీరోగా […]

సినిమా టికెట్ల పంపిణీ పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!
X

ఏపీలో ఆన్ లైన్ టికెటింగ్ విధానం అమల్లోకి తీసుకొస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల కింద ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం తగ్గించింది. బెనిఫిట్ షోలను కూడా రద్దు చేసింది. తగ్గిన సినిమా టిక్కెట్ల ధరల పై ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇదిలా ఉండగా టిక్కెట్లను ఆన్లైన్లోనే ప్రభుత్వం విడుదల చేస్తుందని.. ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. ఈ విధానం అమలు కావడంలో కొంత ఆలస్యమైంది.

ఇటీవల బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ, అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమాలకు మామూలుగానే సినిమా టికెట్లు బుక్ మై షో, పేటీఎం యాప్ ల ద్వారా, థియేటర్ల వద్ద నేరుగా టిక్కెట్ల అమ్మకాలను కొనసాగించారు. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల పంపిణీ పై కీలక నిర్ణయం తీసుకుంది.

టికెట్ల పంపిణీ బాధ్యతలను ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్(ఏపీఎఫ్ డీసీ)కు అప్పగించింది. గతంలో చేసిన చట్ట సవరణ ప్రకారం జీవో 142 ను విడుదల చేసింది. సినిమా టిక్కెట్ల పంపిణీకి ఐఆర్సీటీసీ తరహాలో ఒక ప్రత్యేక వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక నుంచి ఏపీఎఫ్ డీసీ ద్వారానే సినిమా టికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్ ను తీసుకురానున్నారు. సంక్రాంతి కానుకగా పలు భారీ చిత్రాలు విడుదల కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.

First Published:  19 Dec 2021 3:53 PM IST
Next Story