Telugu Global
NEWS

ఒమిక్రాన్‌తో ప్ర‌మాదం లేదు.. అలా అని నిర్ల‌క్ష్య‌మూ వ‌ద్దు

ప్ర‌జ‌ల‌ను భ‌యంతో కుదిపేస్తున్న ఒమిక్రాన్‌పై స్పష్టత వచ్చింది. ఒమిక్రాన్‌తో ఇప్పటివరకు యూకేలో మాత్రమే ఒకరు చ‌నిపోయారు. వేరియంట్ పుట్టిన‌ దక్షిణాఫ్రికాలో ఎలాంటి మరణాలులేవు. కాబట్టి ఒమిక్రాన్‌తో ప్రాణాలకు ప్రమాదంలేదు. అలా అని అజాగ్రత్త వద్దు.. అని తెలంగాణ రాష్ట్ర‌ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు చెబుతున్నారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై ఒమిక్రాన్‌ తీవ్రత ఎలా ఉంటుందో తెలియదని, రెండు మూడు వారాల్లో దీనిపై స్పష్టత వస్తుందన్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 8 కేసులు.. ‘ఒమిక్రాన్‌ వేరియంట్‌లో 30 […]

ఒమిక్రాన్‌తో ప్ర‌మాదం లేదు.. అలా అని నిర్ల‌క్ష్య‌మూ వ‌ద్దు
X

ప్ర‌జ‌ల‌ను భ‌యంతో కుదిపేస్తున్న ఒమిక్రాన్‌పై స్పష్టత వచ్చింది. ఒమిక్రాన్‌తో ఇప్పటివరకు యూకేలో మాత్రమే ఒకరు చ‌నిపోయారు. వేరియంట్ పుట్టిన‌ దక్షిణాఫ్రికాలో ఎలాంటి మరణాలులేవు. కాబట్టి ఒమిక్రాన్‌తో ప్రాణాలకు ప్రమాదంలేదు. అలా అని అజాగ్రత్త వద్దు.. అని తెలంగాణ రాష్ట్ర‌ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు చెబుతున్నారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై ఒమిక్రాన్‌ తీవ్రత ఎలా ఉంటుందో తెలియదని, రెండు మూడు వారాల్లో దీనిపై స్పష్టత వస్తుందన్నారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో 8 కేసులు..
‘ఒమిక్రాన్‌ వేరియంట్‌లో 30 నుంచి 50 వరకు పరివర్తనాలు వచ్చాయి. అందుకే వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తుంది. కొన్నిచోట్ల వ్యాక్సిన్‌ వేసుకున్నా ఒమిక్రాన్‌ వస్తుంది. శుక్రవారం నాటికి తెలంగాణ‌లో మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. అందులో ఒకరు పశ్చిమబెంగాల్‌కు వెళ్లగా, తెలంగాణలో ప్రస్తుతం 8 కేసులున్నాయి. తాజాగా హన్మకొండకు చెందిన మహిళకు ఒమిక్రాన్‌ సోకింది. ఆమె యూకే నుంచి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు విమానాశ్రయంలో నెగెటివ్‌ వచ్చిందని, ఎనిమిది రోజుల తర్వాత చేసిన ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో పాజిటివ్‌ తేలితే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లో ఒమిక్రాన్‌ బయటపడింది. మరో కేసుకు సంబంధించిన వివరాలను గుర్తించే పనిలో ఉన్నాం’ అని డాక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు స్ప‌ష్టం చేశారు.

అన్నీ విదేశాల నుంచి వ‌చ్చిన‌వే..
రాష్ట్రంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల‌న్నీ కూడా ఇతర దేశాల నుంచే వచ్చినవేనని డాక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు స్పష్టంచేశారు. తెలంగాణకు చెందిన ఎవరికీ ఒమిక్రాన్‌ రాలేదని, ఒమిక్రాన్‌ సామాజికవ్యాప్తి జరగలేదని చెప్పారు. కేంద్రప్ర‌భుత్వ‌ నిబంధనల ప్రకారమే ఎయిర్‌పోర్టులో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఒమిక్రాన్ ముప్పులేని దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారందరికీ పరీక్షలు చేయడం సాధ్యంకాదని, రెండు శాతం మందికే చేస్తున్నామ‌ని చెప్పారాయ‌న‌. ఎయిర్‌పోర్టు కేంద్ర ప్ర‌భుత్వ నియంత్ర‌ణ‌లో ఉంటుంద‌ని వివ‌రించారు.

ఆ 21 మందిని గుర్తిస్తున్నాం..
రాష్ట్రంలో నమోదైన 9 ఒమిక్రాన్‌ కేసుల్లో కొందరు ఒక డోస్‌ వేసుకోగా, కొందరు అసలు వ్యాక్సినే వేసుకోలేదని చెప్పారు. రాష్ట్రంలోకి ప్రవేశించిన ఎనిమిది మంది ఒమిక్రాన్‌ బాధితులతో కాంటాక్టు అయిన 21 మందిని గుర్తిస్తున్నామ‌ని, హైద‌రాబాద్ టోలీచౌక్‌లోని సంబంధిత కాలనీలో ఒకేరోజు 500కు పైగా పరీక్షలు చేశామ‌ని స్ప‌ష్టం చేశారు.

First Published:  18 Dec 2021 3:47 PM IST
Next Story