Telugu Global
Cinema & Entertainment

రాధేశ్యామ్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ డీటెయిల్స్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా..? పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర దర్శక నిర్మాతలు కూడా అలాగే కష్టపడుతున్నారు. ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే, మరోవైపు ప్రమోషన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ డేట్ ఫిక్స్ చేశారు. డిసెంబర్ 23న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అభిమానులే అతిథులుగా ఈ పాన్ ఇండియన్ సినిమా ప్రీ […]

Radhe Shyam Movie
X

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా..? పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర దర్శక నిర్మాతలు కూడా అలాగే కష్టపడుతున్నారు. ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే, మరోవైపు ప్రమోషన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ డేట్ ఫిక్స్ చేశారు.

డిసెంబర్ 23న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అభిమానులే అతిథులుగా ఈ పాన్ ఇండియన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమం రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. పూర్తిగా కోవిడ్ నిబంధనలు పాటించి ఈ వేడుక జరుగనుంది. అదే రోజు 5 భాషలకు సంబంధించిన ట్రైలర్ విడుదల కానుంది. అంతే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఈవెంట్ కు వస్తున్నారు. వాళ్ళ చేతుల మీదుగానే ట్రైలర్ విడుదల కానుంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ హీరో.. తన సినిమా ట్రైలర్ అభిమానులతో విడుదల చేయించడం నిజంగా గొప్ప విషయం.

ఈ సినిమా కోసం చాలా మంది సంగీత దర్శకులు పని చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్, నార్త్ వర్షన్స్‌కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి.

జనవరి 14న గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతున్నాడు రాధేశ్యామ్.

First Published:  18 Dec 2021 12:55 PM IST
Next Story