Telugu Global
Cinema & Entertainment

మొదటి రోజు దుమ్ముదులిపిన పుష్ప

పుష్ప సినిమాకు మొదటి రోజు మంచి వసూళ్లు వచ్చాయి. సినిమాపై అంచనాలు భారీగా ఉండడం, అడ్వాన్స్ బుకింగ్ జోరుగా సాగడంతో పుష్పకు ఫస్ట్ డే వరల్డ్ వైడ్ 70 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా పుష్ప వసూళ్లను వెల్లడించలేదు. ఓవరాల్ గా మాత్రమే సినిమా కలెక్షన్లను చెప్పారు. నైజాంలో పుష్ప సినిమాకు 11 కోట్ల 44 లక్షల రూపాయల షేర్ వచ్చినట్టు ప్రకటించారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు. నైజాంలో […]

pushpa movie allu arjun
X

పుష్ప సినిమాకు మొదటి రోజు మంచి వసూళ్లు వచ్చాయి. సినిమాపై అంచనాలు భారీగా ఉండడం, అడ్వాన్స్ బుకింగ్ జోరుగా సాగడంతో పుష్పకు ఫస్ట్ డే వరల్డ్ వైడ్ 70 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా పుష్ప వసూళ్లను వెల్లడించలేదు. ఓవరాల్ గా మాత్రమే సినిమా కలెక్షన్లను చెప్పారు.

నైజాంలో పుష్ప సినిమాకు 11 కోట్ల 44 లక్షల రూపాయల షేర్ వచ్చినట్టు ప్రకటించారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు. నైజాంలో దీన్ని ఆల్ టైమ్ రికార్డ్ గా చెబుతున్నారు. ఇక ఆంధ్రాలో (సీడెడ్ తో కలిపి) 15 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్టు వెల్లడించారు.

మరోవైపు బాలీవుడ్ లో కూడా పుష్ప సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. నిన్న ఒక్క రోజే 3 కోట్ల 75 లక్షల రూపాయల షేర్ వచ్చింది. నార్త్ లో చాలా చోట్ల 50శాతం ఆక్యుపెన్సీ నిబంధన అమల్లో ఉంది. అయినప్పటికీ పుష్పకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం పెద్ద విషయంగా చెబుతున్నారు. అటు తమిళనాడు నుంచి 4 కోట్లు, కేరళ నుంచి రెండున్నర కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఇక ఓవర్సీస్ లో ఇవాళ్టి వసూళ్లతో ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరుతోంది.

First Published:  18 Dec 2021 1:03 PM IST
Next Story