Telugu Global
Cinema & Entertainment

నా ఇష్టం అంటున్న బ్రహ్మానందం

తనకు సినిమాలు తగ్గలేదు, తనే సినిమాలు తగ్గించానని చెప్పుకొచ్చారు బ్రహ్మానందం. 33 ఏళ్లుగా చాలా కష్టపడ్డానని, ఇకపై శరీరానికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సెట్స్ లో ఉంటానని, ఆ తర్వాత లొకేషన్ నుంచి బయటకొచ్చేస్తానని తెలిపారు. ఈ కండిషన్స్ కు నచ్చితేనే తనను తీసుకోవాలని, లేదంటే తనను సంప్రదించొద్దని కరాఖండిగా చెప్పేస్తున్నారు. హీరోతో కాంబినేషన్ సీన్స్ ఉన్నప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టయినా, కమెడియన్ అయినా, […]

నా ఇష్టం అంటున్న బ్రహ్మానందం
X

తనకు సినిమాలు తగ్గలేదు, తనే సినిమాలు తగ్గించానని చెప్పుకొచ్చారు బ్రహ్మానందం. 33 ఏళ్లుగా చాలా కష్టపడ్డానని, ఇకపై శరీరానికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సెట్స్ లో ఉంటానని, ఆ తర్వాత లొకేషన్ నుంచి బయటకొచ్చేస్తానని తెలిపారు. ఈ కండిషన్స్ కు నచ్చితేనే తనను తీసుకోవాలని, లేదంటే తనను సంప్రదించొద్దని కరాఖండిగా చెప్పేస్తున్నారు.

హీరోతో కాంబినేషన్ సీన్స్ ఉన్నప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టయినా, కమెడియన్ అయినా, హీరోయిన్ అయినా వెయిట్ చేయాల్సిందే. ఇన్నాళ్లూ బ్రహ్మానందం అదే చేశారు. రాత్రిపగలు తేడా లేకుండా కష్టపడ్డారు. కానీ ఇకపై కాంబినేషన్ సీన్ల కోసం ఓవర్ టైమ్ పనిచేయడం తన వల్ల కాదని ప్రకటించారు. కాంబినేషన్ సీన్లు ఉన్నప్పుడు తను చెప్పిన టైమ్స్ లో సెట్ చేసుకోవాలని, లేదంటే తనను సినిమా నుంచి తప్పించేయాలని కోరుతున్నారు.

కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న టైమ్ లో నెలకు పాతిక సినిమాలు చేసిన బ్రహ్మానందం, ఇప్పుడు తననుతాను తగ్గించుకున్నారు. ప్రస్తుతం ఈ హాస్యబ్రహ్మ చేతిలో 5 సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఇక మిగిలిన ఖాళీ సమయాన్ని తన ఆటోబయోగ్రఫీ రాయడానికి కేటాయిస్తున్నారు బ్రహ్మానందం.

First Published:  18 Dec 2021 1:00 PM IST
Next Story