Telugu Global
Others

2022 లో ప్రయాణాలు ఎంతో ప్రత్యేకం.. ఎందుకంటే..

గత రెండేళ్లుగా కరోనా కారణంగా జనాలు ట్రావెల్ చేయడాన్ని తగ్గించారు. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతుండడంతో వచ్చే ఏడాది ట్రావెలింగ్‌కు అనువైన సంవత్సరంగా మారబోతోందని సర్వేలు చెప్తున్నాయి. వచ్చే ఏడాది ట్రావెలింగ్ ఎలా ఉంటుందంటే.. ట్రావెల్ ప్రెడిక్షన్స్ 2022 రీసెర్చ్ ప్రకారం వచ్చే ఏడాది ప్రయాణాలు చేసే వారి సంఖ్య 52 శాతం పెరుగుతుందని ఒక అంచనా. రాబోయే రోజుల్లో ట్రావెలింగ్ అనేది సెల్ఫ్‌కేర్‌లో భాగమవ్వనుంది. అంటే మానసిక ఎదుగుదల కోసం మెడిటేషన్, ఎక్సర్‌సైజ్ లాంటివి ఎలా […]

2022 లో ప్రయాణాలు ఎంతో ప్రత్యేకం.. ఎందుకంటే..
X

గత రెండేళ్లుగా కరోనా కారణంగా జనాలు ట్రావెల్ చేయడాన్ని తగ్గించారు. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతుండడంతో వచ్చే ఏడాది ట్రావెలింగ్‌కు అనువైన సంవత్సరంగా మారబోతోందని సర్వేలు చెప్తున్నాయి. వచ్చే ఏడాది ట్రావెలింగ్ ఎలా ఉంటుందంటే..

ట్రావెల్ ప్రెడిక్షన్స్ 2022 రీసెర్చ్ ప్రకారం వచ్చే ఏడాది ప్రయాణాలు చేసే వారి సంఖ్య 52 శాతం పెరుగుతుందని ఒక అంచనా. రాబోయే రోజుల్లో ట్రావెలింగ్ అనేది సెల్ఫ్‌కేర్‌లో భాగమవ్వనుంది. అంటే మానసిక ఎదుగుదల కోసం మెడిటేషన్, ఎక్సర్‌సైజ్ లాంటివి ఎలా అయితే చేస్తామో.. ట్రావెలింగ్ కూడా జీవితంగా ఒక భాగంగా మారుతుంది. తరచూ ప్రయాణాలు చేసే వారిలో 84 శాతం మంది అచ్చగా మానసిక ప్రశాంతత కోసమే ప్రయాణాలు చేస్తున్నట్టు చెప్తున్నారు. ఎమోషనల్ వెల్‌బీయింగ్ కోసం ప్రయాణాలు తప్పనిసరి అని ఇప్పుడున్న యువత బలంగా నమ్ముతున్నారు.

ప్రయాణాల్లో పని వద్దు
కరోనా వచ్చాక ట్రావెలింగ్‌లో కొత్త ట్రెండ్స్ పుట్టుకొచ్చాయి. వర్క్ ఫ్రమ్ వెకేషన్ పేరుతో టూర్‌ను ఎంజాయ్ చేస్తూనే వర్క్ చేసే అవకాశాలు కూడా మొదలయ్యాయి. కానీ 77శాతం ట్రావెలర్స్.. వెకేషన్‌లో పని చేయడాన్ని ఇష్టపడట్లేదు. వెకేషన్‌లో ఉన్నప్పుడు పూర్తి విశ్రాంతినే వారు కోరుకుంటున్నారు. వెకెషన్.. పూర్తి వర్క్ ఫ్రీగా ఉండాలని అభిప్రాయపడుతున్నారు.

ప్రతిక్షణం ఆస్వాదించేలా..
ప్యాండెమిక్ కారణంగా చాలా కాలంగా ఇంట్లో ఇరుక్కుపోయాం అన్న భావన ఉండడంతో ఇప్పుడు ట్రావెలింగ్‌కు ఇంత ప్రత్యేకత చోటు చేసుకుంది. వెళ్లబోయే డెస్టినేషన్ కంటే కూడా ప్రయాణానికి సిద్ధమవ్వడం, ప్రయాణం కోసం ఎదురుచూడడం అనేది చాలామందిని ఉత్సాహపరుస్తుంది. అంతేకాదు, టూర్ అంటే అందమైన ప్రాంతానికి వెళ్లి, చూసి వచ్చాం అన్నట్టుగా కాకుండా.. ఎంచుకున్న ప్రాంతాన్ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. హడావిడిగా కాకుండా ప్రతిక్షణాన్ని అనుభవించేలా ప్రయాణాలు ఉండాలని కోరుకుంటున్నారు.

కమ్యూనిటీ ముఖ్యం
ఎక్కువ మంది ట్రావెలర్స్.. లోకల్ కమ్యూనిటీలతో టైం స్పెండ్ చేయడాన్ని ఇష్టపడుతున్నారు. ఇండియన్ ట్రావెలర్స్‌లో 78 శాతం మంది తాము చేసే ప్రయాణాల్లో లోకల్ కమ్యూనిటీతో కనెక్షన్ ఎంతో ముఖ్యం అని అభిప్రాయపడుతున్నారు. వెళ్లబోయే ప్రాంతం గురించి ముందుగానే తెలుసుకుని అక్కడి కమ్యూనిటీతో కమ్యూనికేట్ అవుతున్నారు.

కొత్త పరిచయాల కోసం..
కొత్తవ్యక్తులతో పరిచయాలకు ప్రయాణాలు బాగా తోడ్పడతాయి. ప్యాండెమిక్ వల్ల స్నేహితులు, బంధువులతో గడిపేందుకు కావాల్సినంత సమయం దొరికింది. ఇప్పుడు కావాల్సిందల్లా కొత్త స్నేహాలు , సోషల్ సర్కిల్స్. ప్రయాణాలు చేసే వారిలో 77 శాతం మంది కొత్త పరిచయాలు, నెట్‌వర్క్‌ను పెంచుకోవడం కోసం ట్రావెల్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అంతే కాదు హనీమూన్ ట్రిప్స్, రొమాంటిక్ వెకేషన్స్‌కు కూడా 2022 అనువైనదిగా కనిపిస్తుంది.

ఎంత రిస్క్ అయినా ఓకే
83 శాతం మంది ట్రావెలర్స్ ఎలాంటి ప్రయాణాలకైనా సై అంటున్నారు. ప్రయాణాల్లో అసౌకర్యాలు, అనుకోని ఇబ్బందుల గురించి ఏమాత్రం భయ పడట్లేదు. ఇల్లు, పని, బాధ్యతల నుంచి దూరంగా ఉండడమే ముఖ్యం అని అంటున్నారు. బడ్జెట్ ఉండాలే గానీ పెద్ద పెద్ద ట్రిప్స్ వెళ్లడానికి కూడా వెనుకాడబోమని చెప్తున్నారు.

స్మార్ట్ గా ఉంటేనే..
ప్రయాణాలు స్మార్ట్‌గా చేయడాన్ని చాలామంది ఇష్టపడుతున్నారు. టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో ప్రయాణానికి కావల్సిన అన్ని ఏర్పాట్లు ముందే చేసుకోవచ్చు. 76 శాతం మంది ట్రావెలర్స్.. టెక్నాలజీ సాయం లేనిదే ట్రావెలింగ్ చేయడం కష్టమేనని అంటున్నారు.

ప్రయాణాలు మనసుని తేలికపరుస్తాయి. రోజువారీ ఒత్తిడి నుంచి బయటపడేస్తాయి. అందులోనూ గత రెండేళ్లుగా పరిస్థితులు అనుకూలించకపోవడంతో చాలామంది ట్రవెలింగ్‌ను మిస్ అయ్యారని తెలుస్తోంది. ఏదేమైనా.. ట్రావెల్ చేయాలనుకునే వారికి 2022 మంచి సంవత్సరంగా ఉండబోతోంది.

First Published:  17 Dec 2021 11:27 AM IST
Next Story