Telugu Global
NEWS

ఆ రెండ్రోజులు లాక్ డౌన్..? ముందస్తు ఏర్పాట్లలో ప్రజలు..

దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ వేరియంట్ ఎంట్రీ ఇచ్చినా.. హైదరాబాద్ లో కేసుల సంఖ్య పెరగడంతో కంటైన్మెంట్ జోన్ కూడా ప్రకటించడం విశేషం. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలపై పూర్తి స్థాయిలో ఆంక్షలు ఉంటాయని, డిసెంబర్ 31, జనవరి 1న లాక్ డౌన్ ఉంటుందనే ప్రచారం ఊపందుకుంది. లాక్ డౌన్ పెట్టే ఆలోచన ఉన్నట్టు కానీ, లాక్ డౌన్ పెడుతున్నట్టు కానీ ప్రభుత్వం తరపున ఎలాంటి అధికారిక సమాచారం […]

ఆ రెండ్రోజులు లాక్ డౌన్..? ముందస్తు ఏర్పాట్లలో ప్రజలు..
X

దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ వేరియంట్ ఎంట్రీ ఇచ్చినా.. హైదరాబాద్ లో కేసుల సంఖ్య పెరగడంతో కంటైన్మెంట్ జోన్ కూడా ప్రకటించడం విశేషం. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలపై పూర్తి స్థాయిలో ఆంక్షలు ఉంటాయని, డిసెంబర్ 31, జనవరి 1న లాక్ డౌన్ ఉంటుందనే ప్రచారం ఊపందుకుంది. లాక్ డౌన్ పెట్టే ఆలోచన ఉన్నట్టు కానీ, లాక్ డౌన్ పెడుతున్నట్టు కానీ ప్రభుత్వం తరపున ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినా ఈ ప్రచారాన్ని మాత్రం జనం ఈజీగా నమ్మేస్తున్నారు.

ఆ రెండ్రోజులు కీలకం..
2021కి వీడ్కోలు పలుకుతూ, 2022కి స్వాగతం పలికేందుకు ఇప్పటినుంచే యవత ప్లాన్ల్ రెడీ చేసుకుంది. ఎక్కడ పార్టీ చేసుకోవాలి, ఎక్కడ గెట్ టు గెదర్ కావాలి, కొత్త సంవత్సరం ఎక్కడెక్కడికి వెళ్లాలి, ఎవరెవరిని కలవాలి అనే ఉత్సాహంలో ఉన్నారు. ఇలాంటి సందడి వాతావరణంలోనే సైలెంట్ గా ఒమిక్రాన్ పడగవిప్పే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం లాక్ డౌన్ తరహా ఆంక్షలు విధించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు..
కొత్త ఏడాది బొకేలు, స్వీట్లు, కేక్ ల బిజినెస్ బాగా జరుగుతుంది. ప్రభుత్వాలకి మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం మంచి కిక్కునిస్తుంది. ప్రస్తుతం లాక్ డౌన్ పెడతారనే ప్రచారంతో ఆయా బిజినెస్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. అటు ప్రయాణాలు పెట్టకున్నవారు కూడా హడావిడి పడుతున్నారు. కొంతమంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ముందస్తుగా ప్రణాళికలు వేసుకుని ఇబ్బంది పడటంకంటే సైలెంట్ గా ఉండటం మేలని మరికొందరు కొత్త సంవత్సర వేడుకల్ని విరమించుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది.

ఆంక్షలు మాత్రమే కఠినం..
కొత్త ఏడాది సందర్భంగా రెండ్రోజులపాటు లాక్ డౌన్ పెడతారనేది ఊహాగానమే అయినా.. ఆంక్షలు మాత్రం ఆ రెండ్రోజుల్లో కఠినంగా ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో సహా.. ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కొవిడ్ నిబంధనలు కఠినతరం చేశారు. వాటిని కొనసాగించడంతోపాటు.. ఆ రెండ్రోజులు జన సమూహాల విషయంలో ఆంక్షలు పెట్టబోతున్నారు.

First Published:  17 Dec 2021 2:26 PM IST
Next Story