Telugu Global
National

పుడుతూనే ఆధార్.. పేరుకంటే ముందే నెంబర్ తో గుర్తింపు..

పుడుతూనే పిల్లవాడికి ఏం పేరు పెట్టాలా అని ఆలోచించేవారు గతంలో. ఆ తర్వాత బర్త్ సర్టిఫికెట్ తీసుకోవడం తొలి ప్రాధాన్యతగా నిలిచింది. ఇప్పుడు పుడుతూనే ఆధార్ నెంబర్ తీసుకోవడం ఫస్ట్ ప్రయారిటీ. అవును, ఇప్పటి వరకూ పుట్టిన పిల్లలకు ఏడాది తర్వాత ఆధార్ నెంబర్ ఇస్తుండగా.. ఇప్పుడది పుట్టిన వెంటనే ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పుట్టిన తొలిరోజే ఆస్పత్రికి సిబ్బంది వచ్చి ఫొటో తీసుకుని, ఆధార్ అప్లికేషన్ నింపుకొని వెళ్తారు. ఆ తర్వాత ఆధార్ నెంబర్ ఇచ్చేస్తారు. […]

పుడుతూనే ఆధార్.. పేరుకంటే ముందే నెంబర్ తో గుర్తింపు..
X

పుడుతూనే పిల్లవాడికి ఏం పేరు పెట్టాలా అని ఆలోచించేవారు గతంలో. ఆ తర్వాత బర్త్ సర్టిఫికెట్ తీసుకోవడం తొలి ప్రాధాన్యతగా నిలిచింది. ఇప్పుడు పుడుతూనే ఆధార్ నెంబర్ తీసుకోవడం ఫస్ట్ ప్రయారిటీ. అవును, ఇప్పటి వరకూ పుట్టిన పిల్లలకు ఏడాది తర్వాత ఆధార్ నెంబర్ ఇస్తుండగా.. ఇప్పుడది పుట్టిన వెంటనే ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పుట్టిన తొలిరోజే ఆస్పత్రికి సిబ్బంది వచ్చి ఫొటో తీసుకుని, ఆధార్ అప్లికేషన్ నింపుకొని వెళ్తారు. ఆ తర్వాత ఆధార్ నెంబర్ ఇచ్చేస్తారు.

అన్నిటికీ ఆధార్.. అందుకే..
ప్రస్తుతం భారత్ లో అన్ని ప్రభుత్వ పథకాలు ఆధార్ తో అనుసంధానం అయ్యాయి. వ్యక్తుల ఆరోగ్యానికి సంబంధించిన సమస్త సమాచారమంతా ఆధార్ తో అనుసంధానించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పుట్టిన పిల్లల వివరాలు, వారి ఆరోగ్యం, టీకాల వివరాలు కూడా ఆధార్ తో అనుసంధానించబోతున్నారు. అయితే పుట్టిన ఏడాది తర్వాతే, అది కూడా తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ఆధార్ సెంటర్లకు వెల్లి యూఐడీఏఐ నెంబర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ జంఝాటం అంతా లేకుండా తల్లి గర్భంలోనుంచి భూమ్మీదకు వచ్చిన రోజే.. వారికి ఆధార్ జనరేట్ అయిపోయే విధానం అమలులోకి రాబోతోంది. దీనికోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని చెబుతున్నారు ఆధార్ సంస్థ సీఈవో సౌరభ్ గార్గ్. ఈ విషయంలో రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్ విభాగంతో ఆధార్ సంస్థ చర్చలు జరుపుతోంది. ఇది ఒ కొలిక్కి వచ్చిన వెంటనే అప్పుడే పుట్టిన పిల్లలకు ఆస్పత్రిలోనే ఫొటో తీసుకొని ఒక్క క్లిక్‌తోనే ఆధార్‌ కార్డు జారీ చేస్తారు.

ఐదేళ్లలోపు చిన్నారులకు బయోమెట్రిక్ అవసరం లేదు కాబట్టి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి ఆధార్ కార్డుతో దానిని అనుసంధానిస్తామని సౌరభ్ గార్గ్ వెల్లడించారు. ఐదేళ్ల తర్వాత మాత్రం బయోమెట్రిక్ తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం మన దేశంలోని 137 కోట్ల మందికి, అంటే దేశ జనాభాలో 99.7 శాతం మందికి ఆధార్ కార్డ్ లు ఉన్నాయి. భారత్ లో ప్రతి ఏటా రెండు నుంచి రెండున్నర కోట్ల మంది జన్మిస్తున్నారని, వారికి పుట్టిన వెంటనే ఆధార్ జారీ చేసేందుకు కృషి చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

First Published:  17 Dec 2021 11:18 AM IST
Next Story