Telugu Global
National

యుని సెక్స్ యూనిఫామ్.. కేరళలో ఇదో సంచలనం..

స్కూల్ పిల్లల యూనిఫామ్ లో రంగులు ఒకటే అయినా.. వారు వేసుకునే దుస్తులు వేర్వేరుగా ఉంటాయి. అబ్బాయిలు నిక్కర్, షర్ట్ వేసుకుంటే.. అమ్మాయిలు షర్ట్ తోపాటు గౌను ధరిస్తారు. పెద్ద తరగతుల్లో అబ్బాయిలకు ఫ్యాంట్, షర్ట్. అమ్మాయిలకు చుడీదార్.. ఇదీ పద్ధతి. ఈ పద్ధతికి స్వస్తి పలుకుతున్నాయి కేరళలోని విద్యా సంస్థలు. 2017లో ఎర్నాకులంలోని వలయన్చిరంగార ప్రభుత్వ స్కూల్ లో ఎలిమెంటరీ సెక్షన్లో మొదలైన ఈ యునిసెక్స్ యూనిఫామ్ ఆలోచన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తోంది. జెండర్ ఈక్వాలిటీ […]

యుని సెక్స్ యూనిఫామ్.. కేరళలో ఇదో సంచలనం..
X

స్కూల్ పిల్లల యూనిఫామ్ లో రంగులు ఒకటే అయినా.. వారు వేసుకునే దుస్తులు వేర్వేరుగా ఉంటాయి. అబ్బాయిలు నిక్కర్, షర్ట్ వేసుకుంటే.. అమ్మాయిలు షర్ట్ తోపాటు గౌను ధరిస్తారు. పెద్ద తరగతుల్లో అబ్బాయిలకు ఫ్యాంట్, షర్ట్. అమ్మాయిలకు చుడీదార్.. ఇదీ పద్ధతి. ఈ పద్ధతికి స్వస్తి పలుకుతున్నాయి కేరళలోని విద్యా సంస్థలు. 2017లో ఎర్నాకులంలోని వలయన్చిరంగార ప్రభుత్వ స్కూల్ లో ఎలిమెంటరీ సెక్షన్లో మొదలైన ఈ యునిసెక్స్ యూనిఫామ్ ఆలోచన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తోంది. జెండర్ ఈక్వాలిటీ యూనిఫామ్ గా దీన్ని అభివర్ణిస్తున్నారు ఆధునిక వాదులు. అమ్మాయి, అబ్బాయి మధ్య లింగ భేదం ఉండకూడదనే ఉద్దేశంతో ఇలాంటి ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ఆట పాటల విషయంలో.. అమ్మాయిలకు ఈ యూనిఫామ్ ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెబుతున్నారు.

తాజాగా కోజికోడ్ జిల్లా బలుస్సేరిలోని ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో కూడా ఇలాంటి పద్ధతినే మొదలు పెట్టారు ఉపాధ్యాయులు. ముందుగా తల్లిదండ్రుల అనుమతి తీసుకుని అమ్మాయిలకు కొత్త యూనిఫామ్ అందించారు. వీరిలో చాలామంది బుధవారం నుంచి కొత్త యూనిఫామ్ లో తరగతులకు హాజరయ్యారు.

ముస్లిం సంఘాల నిరసన..
కేరళలో ప్రభుత్వ స్కూళ్లు ఇలాంటి కొత్త నిబంధనలు తెరపైకి తేవడాన్ని ముస్లిం సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది తమ ఆచార, వ్యవహారాలను అడ్డుకోవడమేనని మండిపడ్డారు కొంతమంది ముస్లిం సంఘాల నేతలు. కోజికోడ్ జిల్లాలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆధునిక దుస్తులు వేసుకోవాలంటూ విద్యార్థినులపై ఒత్తిడి చేయడం తగదని వారు అంటున్నారు.

ఎలిమెంటరీ సెక్షన్లో ఇలాంటి యూనిఫామ్ వేసుకోవడాన్ని ఎవరూ వ్యతిరేకించడంలేదు. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా మోకాళ్ల దిగువ వరకు ఉండే (త్రీ బై ఫోర్త్) ఫ్యాంట్ లు ధరించాలని, షర్ట్ లు ధరించాలేది ఎలిమెంటరీ స్కూల్ నిబంధన. కాలేజీ స్థాయికి వచ్చే సరికి అబ్బాయిలు, అమ్మాయిలు ఫ్యాంట్, షర్ట్ ధరించాల్సి ఉంటుంది. సౌకర్యం పేరుతో తమ సంప్రదాయాలను విస్మరించడం తగదని కొంతమంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.

First Published:  16 Dec 2021 3:02 AM IST
Next Story