మతమార్పిడికి పాల్పడితే పదేళ్ల జైలు..!
మతం మార్పిడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒక్క కర్ణాటకలోనే కాదు.. దేశవ్యాప్తంగా మతమార్పిడులు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అయితే ఈ మత మార్పిడులను అడ్డుకునే విధంగా ఎక్కడా చట్టాలు లేవు. కాగా కర్ణాటకలో ప్రలోభాలకు గురి చేసి మతమార్పిడులు చేస్తున్నారని సంఘ్ పరివార్ ఇటీవల ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో నాయ్యశాఖ మత మార్పిడి నిషేధ బిల్లుకు సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేసింది. మతస్వాతంత్రపు సంరక్షణ హక్కు చట్టం 2021ని […]
మతం మార్పిడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒక్క కర్ణాటకలోనే కాదు.. దేశవ్యాప్తంగా మతమార్పిడులు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అయితే ఈ మత మార్పిడులను అడ్డుకునే విధంగా ఎక్కడా చట్టాలు లేవు. కాగా కర్ణాటకలో ప్రలోభాలకు గురి చేసి మతమార్పిడులు చేస్తున్నారని సంఘ్ పరివార్ ఇటీవల ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో నాయ్యశాఖ మత మార్పిడి నిషేధ బిల్లుకు సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేసింది. మతస్వాతంత్రపు సంరక్షణ హక్కు చట్టం 2021ని బెళగావి లో జరుగుతున్న శాసనసభ శీతాకాల సమావేశాల్లోనే ఆమోదించాలని రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ బిల్లు అమల్లోకి వస్తే మత మార్పిడి పాల్పడే వారికి కఠిన శిక్ష విధించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ తీరని వారిని, మహిళలు, మానసిక వైకల్యం ఉన్న వారిని బలవంతంగా మతమార్పిడి చేస్తే మూడేళ్ళ నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 వేల జరిమానా విధించడం జరుగుతుంది. ఇతర వర్గాల వారితో బలవంతంగా మతమార్పిడి చేయిస్తే మూడేళ్ళ నుంచి ఇదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తారు.
సామూహికంగా మత మార్పిడులను చేయిస్తే మూడేళ్ళ నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించడంతో పాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తారు. కాగా స్వచ్ఛందంగా మతమార్పిడి చేసుకోవాలనుకునే వారికి మాత్రం ఈ బిల్లులో వెసులుబాటు కల్పించడం జరిగింది. అలాంటి వారికి ఎటువంటి శిక్షలు,జరిమానాలు విధించడం జరగదు.
అయితే బీజేపీ ప్రభుత్వం తీసుకురానున్న ఈ బిల్లుపై ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్, జేడీఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ రహస్య అజెండాలో భాగంగానే ఈ బిల్లును అమలులోకి తీసుకు రానున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ బిల్లును చట్టసభల్లో తీసుకు వస్తే అడ్డుకుంటామని ఆ పార్టీలు ప్రకటించాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ బిల్లు ఏ మతానికి వ్యతిరేకం కాదని తెలిపింది. బలవంతంగా జరిగే మొత్తం మార్పిడులకు అడ్డుకట్ట వేసేందుకు ఈ బిల్లును అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.