ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిగా పేర్ని నాని..!
ఆంధ్ర ప్రదేశ్ మంత్రి పేర్ని నానికి అదనపు మంత్రిత్వ శాఖను ముఖ్యమంత్రి జగన్ అప్పగించారు. పేర్ని నాని ఇప్పటికే రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రిత్వ శాఖల బాధ్యతలను చూస్తున్నారు. ఇప్పుడు అదనంగా రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ బాధ్యతలు అప్పగిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఇందుకు సంబంధించిన గెజిట్ ను కూడా రాష్ట్ర సీఎస్ సమీర్ శర్మ విడుదల చేశారు. ఇటీవలి కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సఖ్యత లేకుండా పోయింది. […]
ఆంధ్ర ప్రదేశ్ మంత్రి పేర్ని నానికి అదనపు మంత్రిత్వ శాఖను ముఖ్యమంత్రి జగన్ అప్పగించారు. పేర్ని నాని ఇప్పటికే రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రిత్వ శాఖల బాధ్యతలను చూస్తున్నారు. ఇప్పుడు అదనంగా రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ బాధ్యతలు అప్పగిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఇందుకు సంబంధించిన గెజిట్ ను కూడా రాష్ట్ర సీఎస్ సమీర్ శర్మ విడుదల చేశారు.
ఇటీవలి కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సఖ్యత లేకుండా పోయింది. ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ విధానం తీసుకురావడం, సినిమా టికెట్ల ధరలు తగ్గించడం, బెనిఫిట్ షోలు వేసుకునేందుకు ప్రభుత్వం నిరాకరించడం వంటివి జరిగిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు పెద్దలు పేర్ని నాని తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆయన సినీరంగ సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది.
అటు సినీ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై వస్తున్న విమర్శలకు మంత్రి పేర్ని నాని గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో నానికి సినిమాటోగ్రఫీ మంత్రిగా అవకాశం ఇస్తే..ఆయన సినీ ఇండస్ట్రీ పై మరింత దృష్టి పెట్టే అవకాశం ఉందని భావించిన ముఖ్యమంత్రి జగన్ ఆయనకు అదనంగా సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు అప్పగించారని చెబుతున్నారు.