డానియల్ శేఖర్ అదరగొట్టేశాడు
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర. ‘భీమ్లా నాయక్‘ చిత్రం నుంచి ఈరోజు ఓ టీజర్ విడుదల చేశారు. అది కూడా రానాకు సంబంధించిన టీజర్. ఎందుకంటే, ఈరోజు రానా పుట్టినరోజు కాబట్టి. ‘భీమ్లా నాయక్’ లో రానా పోషించిన […]
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.
‘భీమ్లా నాయక్‘ చిత్రం నుంచి ఈరోజు ఓ టీజర్ విడుదల చేశారు. అది కూడా రానాకు సంబంధించిన టీజర్. ఎందుకంటే, ఈరోజు రానా పుట్టినరోజు కాబట్టి. ‘భీమ్లా నాయక్’ లో రానా పోషించిన డేనియల్ శేఖర్ అనే పాత్ర కు సంబంధించిన వీడియో ఇది.
“వాడు అరిస్తే భయపడతానా.. ఆడికన్నా గట్టిగా అరవగలను.. ఎవడాడు.. దీనమ్మ దిగొచ్చాడా…” అంటూ భీమ్లానాయక్ పాత్రను ఉద్దేశించి రానా ఆవేశంతో చెప్పిన డైలాగ్, టీజర్ లో హైలెట్ గా నిలిచింది.
‘భీమ్లా నాయక్‘ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. జనవరి 12న థియేటర్లలోకి రాబోతున్నాడు భీమ్లానాయక్.