Telugu Global
Cinema & Entertainment

విరాటపర్వం నుంచి రవన్న గొంతుక

రానా, సాయి పల్లవి కలిసి చేసిన సినిమా విరాటపర్వం. ఇదివరకు ఎన్నడూ పోషించ‌ని పాత్రలో రానా, సాయిప‌ల్లవి ఈ సినిమాలో కనిపించబోతోన్నారు. ఇంకా చెప్పాలంటే 80ల నాటి నక్సలైట్ రవన్న పాత్రలో రానా కనిపించబోతున్నాడు. అతడ్ని ప్రేమించే తెలంగాణ అమ్మాయి పాత్రలో సాయిపల్లవి కనిపించనుంది. 1990 ప్రాంతంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో కామ్రేడ్ రవన్న పాత్రలో రానా నటిస్తున్నాడు. అతని కలం పేరు అరణ్య. రవన్నను ఆరాధించే అమ్మాయిగా వెన్నెల కారెక్టర్‌లో […]

విరాటపర్వం నుంచి రవన్న గొంతుక
X

రానా, సాయి పల్లవి కలిసి చేసిన సినిమా విరాటపర్వం. ఇదివరకు ఎన్నడూ పోషించ‌ని పాత్రలో రానా, సాయిప‌ల్లవి ఈ సినిమాలో కనిపించబోతోన్నారు. ఇంకా చెప్పాలంటే 80ల నాటి నక్సలైట్ రవన్న పాత్రలో రానా కనిపించబోతున్నాడు. అతడ్ని ప్రేమించే తెలంగాణ అమ్మాయి పాత్రలో సాయిపల్లవి కనిపించనుంది.

1990 ప్రాంతంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో కామ్రేడ్ రవన్న పాత్రలో రానా నటిస్తున్నాడు. అతని కలం పేరు అరణ్య. రవన్నను ఆరాధించే అమ్మాయిగా వెన్నెల కారెక్టర్‌లో సాయి పల్లవి నటించింది. ఎన్ కౌంటర్ నేపథ్యంలో అందమైన ప్రేమ కథను ఈ విరాట పర్వం సినిమాలో చూపించబోతోన్నారు.

రానా బర్త్ డే సందర్బంగా వాయిస్ ఆఫ్ రవన్న అంటూ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది యూనిట్. ఇందులో రవన్న ఇచ్చిన ప్రసంగం అందరినీ ఉత్తేజపరిచేలా ఉంది. “దొరొల్ల తలుపుల తాళంలా.. గఢీల ముంగట కుక్కల్లా.. ఎన్నాళ్లు ఇంకెన్నాళ్లు.. చలో పరిగెత్తు.. చలో పరిగెత్తు’ అంటూ రవన్న పాత్రలో రానా చెప్పిన డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి.

ఈ వీడియోలో రానా ప్రయాణం, యుద్దం మధ్యలో సాయి పల్లవితో ప్రేమాయణం, విజువల్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. సంక్రాంతికి ట్రైలర్ రాబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు. వేణు ఊడుగుల డైరక్ట్ చేసిన ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు.

First Published:  14 Dec 2021 1:10 PM IST
Next Story