మరో సినిమా ప్రకటించిన చిరంజీవి
చకచకా సినిమాలకు ఓకే చెబుతున్నారు చిరంజీవి. మొన్నటివరకు ఏడాదికి ఒక సినిమా చేసిన చిరంజీవి, ఇప్పుడు ఏకంగా 4-5 సినిమాల్ని లైన్లో పెట్టారు. ఆల్రెడీ సెట్స్ పై ఉన్న మూవీస్ తో పాటు తాజాగా మరో సినిమాను ప్రకటించారు మెగాస్టార్. వెంకీ కుడుముల దర్శకత్వంలో, డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సినిమా ప్రకటన వచ్చేసింది. ఛలో సినిమాతో దర్శకుడిగా మారాడు వెంకీ కుడుముల. ఆ తర్వాత భీష్మ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టాడు. […]
చకచకా సినిమాలకు ఓకే చెబుతున్నారు చిరంజీవి. మొన్నటివరకు ఏడాదికి ఒక సినిమా చేసిన చిరంజీవి, ఇప్పుడు ఏకంగా 4-5 సినిమాల్ని లైన్లో పెట్టారు. ఆల్రెడీ సెట్స్ పై ఉన్న మూవీస్ తో పాటు తాజాగా మరో సినిమాను ప్రకటించారు మెగాస్టార్. వెంకీ కుడుముల దర్శకత్వంలో, డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సినిమా ప్రకటన వచ్చేసింది.
ఛలో సినిమాతో దర్శకుడిగా మారాడు వెంకీ కుడుముల. ఆ తర్వాత భీష్మ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇప్పుడు తన మూడో సినిమాకే మెగాస్టార్ ను డైరక్ట్ చేయబోతున్నాడు. చిరంజీవి కోసం తనదైన స్టయిల్ లో హిలేరియస్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు వెంకీ కుడుముల. అందులో కామెడీ నచ్చి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ప్రస్తుచం గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. వీటితో పాటు బాబి దర్శకత్వంలో సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చారు. ఇదే ఊపులో వెంకీ కుడుముల సినిమా కూడా సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది.