Telugu Global
Cinema & Entertainment

మిలియన్ డాలర్ క్లబ్ లోకి అఖండ

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ సినిమా మరో రికార్డ్ సృష్టించింది. ఓవర్సీస్ లో ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది. విడుదలైన మొదటి రోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా, ఓవర్సీస్ లో కూడా 10 లక్షల డాలర్ల వసూళ్లు సాధించి, ఈ ఏడాది మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన అతికొద్ది సినిమాల్లో ఒకటిగా నిలిచింది. బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాపై రిలీజ్ […]

మిలియన్ డాలర్ క్లబ్ లోకి అఖండ
X

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ సినిమా మరో రికార్డ్ సృష్టించింది. ఓవర్సీస్ లో ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది. విడుదలైన మొదటి రోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా, ఓవర్సీస్ లో కూడా 10 లక్షల డాలర్ల వసూళ్లు సాధించి, ఈ ఏడాది మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన అతికొద్ది సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాపై రిలీజ్ కు ముందు నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా వచ్చిన అఖండ.. మంచి విజయాన్నందుకుంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా నిలిచింది. ఇంతకుముందు బాలయ్య-బోయపాటి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలను మించి హిట్ అయింది ఈ సినిమా.

ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకుంది. 3 ఏరియాలు మినహా అన్ని ఏరియాల్లో అఖండ లాభాల్లోకి ఎంటరైంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్యాక్ బోన్ గా నిలిచింది. ప్రగ్యాజైశ్వాల్ హీరోయిన్ గా నటించింది.

First Published:  14 Dec 2021 1:18 PM IST
Next Story