సత్యదేవ్ నుంచి మరో సినిమా రెడీ
మినిమం గ్యాప్స్ లో సినిమాలు విడుదల చేస్తున్నాడు హీరో సత్యదేవ్. ముందుగా తిమ్మరుసు సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చాడు. ఆ సినిమా విడుదలైన కొన్ని నెలలకే స్కైలాబ్ సినిమాను రిలీజ్ చేశాడు. ఇప్పుడు 2 నెలల గ్యాప్ లో మరో సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు. సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నాగశేఖర్ తెరకెక్కిస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం. మేఘా ఆకాశ్, కావ్య శెట్టి కూడా హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ కు మంచి […]
మినిమం గ్యాప్స్ లో సినిమాలు విడుదల చేస్తున్నాడు హీరో సత్యదేవ్. ముందుగా తిమ్మరుసు సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చాడు. ఆ సినిమా విడుదలైన కొన్ని నెలలకే స్కైలాబ్ సినిమాను రిలీజ్ చేశాడు. ఇప్పుడు 2 నెలల గ్యాప్ లో మరో సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు.
సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నాగశేఖర్ తెరకెక్కిస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం. మేఘా ఆకాశ్, కావ్య శెట్టి కూడా హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన గుర్తుందా శీతాకాలం చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదే ఊపులో సినిమాను ఫిబ్రవరి 2022లో విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామన్నారు.
ప్రతీ ఒక్కరు తమ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విషయాల్ని ఎప్పటికీ మరిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వచ్చే యూత్ లైఫ్‌లో జరిగే సంఘటనలు జీవితాంతం గుర్తుకువస్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాదకరమైన సంఘటనలు ప్రేక్షకులకి గుర్తుచేసే ఉద్దేశంతో తెరకెక్కిన సినిమానే గుర్తుందా శీతాకాలం. సినిమాలో యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో పాటు, హార్ట్ టచింగ్ సన్నివేశాలు ఉంటాయని చెబుతున్నాడు దర్శకుడు.