మిస్ యూనివర్స్‌గా మన పంజాబీ గర్ల్.. ఇంతకీ ఈమె ఎవరంటే..
21 ఏళ్ల తర్వాత భారత్ కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. ఇజ్రాయెల్‌లో ఆదివారం జరిగిన మిస్ యూనివర్స్ అందాల పోటీలో భారత్‌కు చెందిన హర్నాజ్ సంధు గెలుపొందింది.1994లో సుశ్మితా సేన్, 2000లో లారా దత్తా తర్వాత భారత్‌కు మిస్ యూనివర్స్ కిరీటం రావడం మళ్లీ ఇప్పుడే. 2021 మిస్ యూనివర్స్ విన్నర్‌గా నిలిచిన 21 ఏళ్ల హర్నాజ్ సంధు ఎవరంటే.. చంఢీఘఢ్ లోని పంజాబీ కుటుంబంలో జన్మించిన సంధు.. శివాలిక్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను […]
21 ఏళ్ల తర్వాత భారత్ కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. ఇజ్రాయెల్‌లో ఆదివారం జరిగిన మిస్ యూనివర్స్ అందాల పోటీలో భారత్‌కు చెందిన హర్నాజ్ సంధు గెలుపొందింది.1994లో సుశ్మితా సేన్, 2000లో లారా దత్తా తర్వాత భారత్‌కు మిస్ యూనివర్స్ కిరీటం రావడం మళ్లీ ఇప్పుడే. 2021 మిస్ యూనివర్స్ విన్నర్‌గా నిలిచిన 21 ఏళ్ల హర్నాజ్ సంధు ఎవరంటే..
చంఢీఘఢ్ లోని పంజాబీ కుటుంబంలో జన్మించిన సంధు.. శివాలిక్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేసింది. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ పట్టాపుచ్చుకుంది. ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. హర్నాజ్‌కు చిన్నప్పటి నుంచే మోడలింగ్‌పై ఆసక్తి ఉండడంతో చదువుతో పాటే మోడలింగ్‌పైనా దృష్టి పెట్టింది. హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, డ్యాన్స్, యాక్టింగ్, ట్రావెలింగ్‌ను సింధు అమితంగా ఇష్టపడుతుంది.
17 ఏళ్లకే మోడలింగ్ రంగంలో అడుగు పెట్టి, నాలుగు బ్యూటీ కాంటెస్ట్‌లలో విన్నర్‌గా నిలిచింది. 2017లో ‘టైమ్స్ ఫ్రెష్ ఫేస్ మిస్ చండీగఢ్’, 2018లో ‘మిస్ మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్’, 2019లో ‘ఫెమినా మిస్ ఇండియా పంజాబ్’, 2021 లో ‘మిస్ యూనివర్స్’ కిరీటాలను గెలుచుకుంది.
చదువుకునే రోజులలో సింధు చాలా సన్నగా ఉండడంతో తోటి విద్యార్థులు ఆమెను ఏడ్పించేవారట. ఆ మాటలకు ఎంతో బాధపడేదాన్ని అని సింధు చెప్తుంటుంది. అలాంటి మాటలకు కుంగి పోకుండా ఫ్యామిలీ సపోర్ట్‌తో మోడలింగ్‌లో అడుగుపెట్టి, అంచెలంచెలుగా సక్సెస్ అందుకుంది. అందాల పోటీల్లో పాల్గొంటూ, అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో నటిస్తూ.. మొత్తానికి మిస్ యూనివర్స్ వరకూ చేరుకోగలింది.
మిస్ యూనివర్స్ వేదికపై ఆమె మాట్లాడుతూ.. ‘ప్రకృతిలో చాలా సమస్యలున్నాయని తెలిసి.. తన గుండె పగిలిపోతోంది’ అన్నారు. ‘ఇదంతా బాధ్యతారాహిత్యం వల్లే జరుగుతోందని, మనం చేసే ప్రతి చర్య ప్రకృతిని రక్షించగలద’ని ఆమె చెప్పింది.