Telugu Global
Cinema & Entertainment

10 రోజుల ముందే ప్రీ-రిలీజ్ ఫంక్షన్

సాధారణంగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్లు, సినిమా విడుదలకు 2-3 రోజుల ముందు జరుగుతాయి. లేదంటే వారం ముందు నిర్వహిస్తుంటారు. కానీ నాని సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను మాత్రం ఏకంగా 10 రోజుల ముందు ప్లాన్ చేశారు. దీనికి రాయల్ ఈవెంట్ అనే పేరు కూడా ఫిక్స్ చేశారు. శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేస్తున్నాడు నాని. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా వరంగల్‌లోని రంగలీల మైదానంలో […]

10 రోజుల ముందే ప్రీ-రిలీజ్ ఫంక్షన్
X

సాధారణంగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్లు, సినిమా విడుదలకు 2-3 రోజుల ముందు జరుగుతాయి. లేదంటే వారం ముందు నిర్వహిస్తుంటారు. కానీ నాని సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను మాత్రం ఏకంగా 10 రోజుల ముందు ప్లాన్ చేశారు. దీనికి రాయల్ ఈవెంట్ అనే పేరు కూడా ఫిక్స్ చేశారు.

శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేస్తున్నాడు నాని. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా వరంగల్‌లోని రంగలీల మైదానంలో రాయల్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేయబోతోన్నారు. నానితో పాటు చిత్రయూనిట్ అంతా కూడా ఈ ఈవెంట్‌‌లో పాల్గొననున్నారు. 14వ తేదీన ఈ ఈవెంట్ ను ప్లాన్ చేశారు.

శ్యామ్ సింగరాయ్ ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పటినుంచి ఇప్పటివరకు సినిమా మీద అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. ఇక టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. మిక్కీ జే మేయర్ సంగీత సారథ్యంలో విడుదలైన పాటలకు మంచి ఆదరణ లభించింది. రానున్న రోజుల్లో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలను చిత్రయూనిట్ మరింత పెంచనుంది. ఇందులో భాగంగా 10 రోజుల ముందే ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఫిక్స్ చేశారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ ఇందులో హీరోయిన్లు.

First Published:  11 Dec 2021 2:28 PM IST
Next Story