Telugu Global
National

పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. రాత్రి కర్ఫ్యూకు ప్రతిపాదనలు.. 

ఒమిక్రాన్ తో థర్డ్ వేవ్ మొదలు కాబోతోందన్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. రోజు రోజుకీ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని, కరోనా పాజిటివిటీ రేటు కూడా పెరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వాలు రాత్రి కర్ఫ్యూ విధించడంపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఈమేరకు అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ లేఖ రాశారు. కొవిడ్‌ నిబంధనలపై నిర్లక్ష్యంగా ఉండొద్దని, వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలపై మరింత దృష్టిపెట్టాలని రాజేశ్ […]

పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. రాత్రి కర్ఫ్యూకు ప్రతిపాదనలు.. 
X
ఒమిక్రాన్ తో థర్డ్ వేవ్ మొదలు కాబోతోందన్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. రోజు రోజుకీ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని, కరోనా పాజిటివిటీ రేటు కూడా పెరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వాలు రాత్రి కర్ఫ్యూ విధించడంపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఈమేరకు అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ లేఖ రాశారు. కొవిడ్‌ నిబంధనలపై నిర్లక్ష్యంగా ఉండొద్దని, వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలపై మరింత దృష్టిపెట్టాలని రాజేశ్ భూషణ్ ఆ లేఖలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 27 జిల్లాల్లో గత రెండు వారాలుగా కొవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతోందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. కేరళ, మిజోరం, సిక్కిం రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. మిగతా 7 ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10శాతంగా నమోదైనట్లు పేర్కొంది.
వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి..
కొవిడ్ నిర్థారణ పరీక్షల సంఖ్య పెంచాలని, వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేయాలని కేంద్రం.. రాష్ట్రాలను కోరింది. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా పరిగణించి.. అవసరమైతే రాత్రి కర్ఫ్యూ విధించాలని ఆదేశాలిచ్చింది. పెళ్లిళ్లు, అంత్యక్రియల కార్యక్రమాల్లో పాల్గొనే వారి సంఖ్యపై పరిమితులు విధించాలని సూచించింది.
పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఒమిక్రాన్‌ వేరియంట్ బయటపడిన తర్వాత సహజంగానే టెస్ట్ ల సంఖ్యను పెంచారు. దీంతో కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా పెరుగుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఈ వేరియంట్‌ రెండో కేసు నమోదైంది. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 33కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 17 కేసులు వెలుగుచూశాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ముంబై రెండు రోజుల పాటు 144 సెక్షన్‌ విధించారు. మిగతా రాష్ట్రాలు కూడా ఒమిక్రాన్ రాకతో అప్రమత్తం అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ నిబంధనలు కఠినతరం చేశారు, మాస్క్ లేకపోతే జరిమానాలు విధిస్తున్నారు.
First Published:  11 Dec 2021 2:45 PM IST
Next Story