Telugu Global
NEWS

పూల ఉత్పత్తిలో ఏపీదే మొదటి స్థానం.. 

ఆంధ్రప్రదేశ్ ని అన్నపూర్ణ అంటారు. కృష్ణా, గోదావరి నదీమతల్లుల సస్యశ్యామల తీర ప్రాంతంలో ఆహార ధాన్యాల ఉత్పత్తితో ధాన్యాగారంగా విలసిల్లింది ఉమ్మడి రాష్ట్రం. ఇప్పుడు నవ్యాంధ్ర మరో అరుదైన గుర్తింపు తెచ్చుకుంది. దేశంలోనే అత్యధికంగా పూలను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. సగటున ఒక హెక్టార్ కి దిగుబడి అవుతున్న పూల పరిమాణాన్ని లెక్కలోకి తీసుకుంటే ఏపీది దేశంలోనే మొదటి స్థానం. చిత్తూరు, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాలు ఈ ఘనతకి కారణం. 2020-21 […]

పూల ఉత్పత్తిలో ఏపీదే మొదటి స్థానం.. 
X
ఆంధ్రప్రదేశ్ ని అన్నపూర్ణ అంటారు. కృష్ణా, గోదావరి నదీమతల్లుల సస్యశ్యామల తీర ప్రాంతంలో ఆహార ధాన్యాల ఉత్పత్తితో ధాన్యాగారంగా విలసిల్లింది ఉమ్మడి రాష్ట్రం. ఇప్పుడు నవ్యాంధ్ర మరో అరుదైన గుర్తింపు తెచ్చుకుంది. దేశంలోనే అత్యధికంగా పూలను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. సగటున ఒక హెక్టార్ కి దిగుబడి అవుతున్న పూల పరిమాణాన్ని లెక్కలోకి తీసుకుంటే ఏపీది దేశంలోనే మొదటి స్థానం. చిత్తూరు, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాలు ఈ ఘనతకి కారణం.
2020-21 సంవత్సరానికి 4.06 లక్షల టన్నుల పూలు ఏపీలో ఉత్పత్తి అయ్యాయి. ఏపీలో 19వేల హెక్టార్లకంటే ఎక్కువ భూమిలో వివిధ రకాల పూల మొక్కల్ని సాగు చేస్తున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా పూల ఉత్పత్తిలో ఏపీ వాటా 15.62 శాతం. ఇక ఈ లిస్ట్ లో తమిళనాడు దేశంలోనే తొలి స్థానంలో ఉంది. 2020-21 సంవత్సరంలో తమిళనాడు నుంచి ఉత్పత్తి అయిన పూలు 5.45 లక్షల టన్నులు. తమిళనాడులో మొత్తం 42వేల హెక్టార్లలో పూలమొక్కలు పెంచుతున్నారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న పూలలో తమిళనాడు వాటా 20.94శాతం. ఆ తర్వాత మధ్యప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న పూలలో మధ్యప్రదేశ్ లో వాటా 15.78 శాతం. అయితే ఉత్పత్తిలో ఈ రెండు రాష్ట్రాలకంటే వెనకే ఉన్నా.. సగటు పూల ఉత్పత్తిలో ఏపీదే మొదటి స్థానం. సగటున ఒక్కో హెక్టార్ కి ఏపీలో 8నుంచి 10 టన్నుల పూలు ఉత్పత్తి అవుతాయి.
ఏపీలో ఉత్పత్తి అయ్యే బంతి, మల్లెపూలు ఒడిశా, పశ్చిమబెంగాల్, తెలంగాణకు ఎగుమతి అవుతున్నాయి. కొన్ని పూలను ఇతర ప్రాంతాలనుంచి తెప్పించుకుని ఏపీలో ప్యాకింగ్ చేసి ఎగుమతి చేస్తుంటారు. ఈ నేపథ్యంలో పూల ఉత్పత్తిలో ఏపీకి మరింత సాయం చేస్తామని తెలిపింది కేంద్రం. తమిళనాడులో లాగా ఏపీలో కూడా పూల మొక్కల పెంపకాన్ని మరింత పెంచేందుకు కేంద్రం ప్రోత్సాహకాలిస్తామంటోంది. సగటు ఉత్పత్తి ఏపీలోనే ఎక్కువ కాబట్టి.. విస్తీర్ణం పెంచితే మరింత మెరుగైన ఫలితాలు సాధించొచ్చని చెబుతోంది. రాజమండ్రిలోని ఫ్లోరికల్చర్ రీసెర్స్ ఇన్ స్టిట్యూట్ కి మరింత ఆర్థిక సాయం అందించి ఏపీలో పూల ఉత్పత్తిని పెంచాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
First Published:  10 Dec 2021 8:32 PM GMT
Next Story