Telugu Global
National

జయ నివాసం వారసులకు అప్పగింత..!

దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసాన్ని ప్రభుత్వం ఆమె మేనల్లుడు దీపక్, మేనకోడలు దీపకు అప్పగించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అవివాహిత అనే విషయం తెలిసిందే. ఆమె మరణం తర్వాత చెన్నై లోని పోయెస్ గార్డెన్ లో జయలలితకు ఉన్న బంగ్లా వేద నిలయాన్ని అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ భవనాన్ని ప్రభుత్వపరం చేసుకున్నట్లు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. జయ నివాసాన్ని ఆమె స్మారక మందిరంగా చేస్తామని అన్నా డీఎంకే […]

జయ నివాసం వారసులకు అప్పగింత..!
X

దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసాన్ని ప్రభుత్వం ఆమె మేనల్లుడు దీపక్, మేనకోడలు దీపకు అప్పగించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అవివాహిత అనే విషయం తెలిసిందే. ఆమె మరణం తర్వాత చెన్నై లోని పోయెస్ గార్డెన్ లో జయలలితకు ఉన్న బంగ్లా వేద నిలయాన్ని అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ భవనాన్ని ప్రభుత్వపరం చేసుకున్నట్లు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

జయ నివాసాన్ని ఆమె స్మారక మందిరంగా చేస్తామని అన్నా డీఎంకే ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనిపై జయ మేనల్లుడు దీపక్, మేనకోడలు దీప మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు..వేద నిలయాన్ని స్మారక మందిరం మార్చుతున్నట్లు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఇటీవల కొట్టివేసింది.

జయ నివాసాన్ని ఆమె వారసులైన దీప, దీపక్ లకు మూడు వారాల్లోగా అప్పజెప్పాలని తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో జయ నివాసానికి సంబంధించిన తాళాలను చెన్నై కలెక్టర్ విజయ రాణి శుక్రవారం దీపక్ దీపలకు అందజేశారు.

చెన్నై కలెక్టరేట్ కు వెళ్లిన దీపక్, దీప కలెక్టర్ నుంచి తాళాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయలలితకు వారసులమైన తమకు ఆమె ఆస్తులకు సంబంధించి సర్వ హక్కులు ఉంటాయని చెప్పారు. కోర్టు వేద నిలయాన్ని తమకు అప్పగించడంపై సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం వారిద్దరూ అక్కడి నుంచి బయల్దేరి పోయెస్ గార్డెన్ లోని నివాసానికి చేరుకున్నారు.

First Published:  10 Dec 2021 10:18 AM GMT
Next Story