Telugu Global
Health & Life Style

ఒక్కరోజే 10 ఒమిక్రాన్ కేసుల నమోదు..!

భారత్ ను ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతోంది. క్రమక్రమంగా దేశంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే పది ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్ లో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 33కు చేరుకుంది. ఇవాళ ఉదయం గుజరాత్ రాష్ట్రంలో రెండు కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. జింబాబ్వే నుంచి గుజరాత్ జామ్ నగర్ కు వచ్చిన ఒక ఎన్ ఆర్ఐకి, అతడి ద్వారా అతడి బంధువుకు ఒమిక్రాన్ సోకింది. అలాగే టాంజానియా […]

ఒక్కరోజే 10 ఒమిక్రాన్ కేసుల నమోదు..!
X

భారత్ ను ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతోంది. క్రమక్రమంగా దేశంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే పది ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్ లో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 33కు చేరుకుంది. ఇవాళ ఉదయం గుజరాత్ రాష్ట్రంలో రెండు కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.

జింబాబ్వే నుంచి గుజరాత్ జామ్ నగర్ కు వచ్చిన ఒక ఎన్ ఆర్ఐకి, అతడి ద్వారా అతడి బంధువుకు ఒమిక్రాన్ సోకింది. అలాగే టాంజానియా నుంచి ముంబైకి వచ్చిన ఒక వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు అధికారులు ధృవీకరించారు. అలాగే మహారాష్ట్రలో ఇవాళ ఏడు కేసులు నమోదయ్యాయి. ముంబై లో మూడు, పింప్రి చించ్ వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య అధికారులు ప్రకటించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 33కి చేరింది.

ప్రస్తుతం ఇండియాలో నమోదైన కేసులన్నీ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, టాంజానియా, నమీబియా నుంచి వచ్చిన వారికే సోకాయి. మన దేశంలో మొదటగా కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ రెండు కేసులతో పాటు మహారాష్ట్రలో 18, రాజస్థాన్ లో 9, గుజరాత్ లో 3, ఢిల్లీలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచంలోని 59 దేశాలకు వ్యాపించింది. నవంబర్ 24వ తేదీన ప్రపంచంలో కేవలం రెండు దేశాల్లో మాత్రమే ఈ వైరస్ ఉండగా.. స్వల్ప వ్యవధిలోనే 59 దేశాలకు పాకింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2943 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కాగా మన దేశంలో తొలిగా ఒమిక్రాన్ బారినపడ్డ వారు క్రమక్రమంగా కోలుకుంటుండటం కాస్త ఉపశమనం ఇస్తోంది.

First Published:  10 Dec 2021 3:54 PM IST
Next Story