ఆర్ఆర్ఆర్ ట్రయిలర్ రివ్యూ
మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ఆర్ఆర్ఆర్ ట్రయిలర్ రిలీజైంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రయిలర్ ను ఈరోజు గ్రాండ్ గా లాంఛ్ చేశారు. ముందుగా ఏపీ, తెలంగాణలోని కొన్ని థియేటర్లలో ట్రయిలర్ ను ప్రసారం చేశారు. ఆ తర్వాత గంట గ్యాప్ లో యూట్యూబ్ లో ట్రయిలర్ ను విడుదల చేశారు. అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా గ్రాండ్ గా తెరకెక్కింది ఆర్ఆర్ఆర్ ట్రయిలర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రల్ని […]
మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ఆర్ఆర్ఆర్ ట్రయిలర్ రిలీజైంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రయిలర్ ను ఈరోజు గ్రాండ్ గా లాంఛ్ చేశారు. ముందుగా ఏపీ, తెలంగాణలోని కొన్ని థియేటర్లలో ట్రయిలర్ ను ప్రసారం చేశారు. ఆ తర్వాత గంట గ్యాప్ లో యూట్యూబ్ లో ట్రయిలర్ ను విడుదల చేశారు.
అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా గ్రాండ్ గా తెరకెక్కింది ఆర్ఆర్ఆర్ ట్రయిలర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రల్ని పరిచయం చేయడంతో పాటు.. వాళ్లిద్దరీ ఎలా ఫ్రెండ్స్ అయ్యారు, ఇద్దరి మధ్య ఎలా వైరం పుట్టింది, ఫైనల్ గా ఇద్దరూ కలిసి బ్రిటిష్ సైన్యాన్ని ఎలా ఎదిరించారనే అంశాలను ట్రయిలర్ లో చూపించారు. ఓ గోండు అమ్మాయి చుట్టూ ఆర్ఆర్ఆర్ కథను అల్లుకున్నట్టు ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది.
నటీనటుల పెర్ఫార్మెన్సులతో పాటు టెక్నికల్ గా కూడా ట్రయిలర్ చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్, ఫైట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఇలా అన్ని విభాగాల్లో ఆర్ఆర్ఆర్ ట్రయిలర్.. ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంది.
ట్రయిలర్ విడుదల చేయడంతో పాటు ప్రెస్ మీట్ కూడా నిర్వహించింది యూనిట్. ఫస్ట్ టైమ్ యూనిట్ అంతా కలిసి మీడియాతో మాట్లాడింది. ముందుగా ముంబయిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. తర్వాత హైదరాబాద్ లో పెట్టారు. రేపు చెన్నై, బెంగళూరులో ప్రెస్ మీట్స్ ఏర్పాటుచేస్తున్నారు.