Telugu Global
Cinema & Entertainment

రానా కొత్త సినిమా రిలీజ్ కు రెడీ

బాహుబలి లాంటి సినిమా తర్వాత హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి, డిఫరెంట్ మూవీస్ చేస్తున్నాడు. అందులో 1945 అనే సినిమా ఒకటి. ఈ పీరియడ్ డ్రామాను సత్యశివ తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. విడుదలకు సిద్దమైంది. సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 31న విడుదల 1945 చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌లో రానా బ్రిటీష్ జెండాను […]

రానా కొత్త సినిమా రిలీజ్ కు రెడీ
X

బాహుబలి లాంటి సినిమా తర్వాత హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి, డిఫరెంట్ మూవీస్ చేస్తున్నాడు. అందులో 1945 అనే సినిమా ఒకటి. ఈ పీరియడ్ డ్రామాను సత్యశివ తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. విడుదలకు సిద్దమైంది. సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

డిసెంబర్ 31న విడుదల 1945 చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌లో రానా బ్రిటీష్ జెండాను కాల్చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. స్వాతంత్ర్య సమర యోధుడి పాత్రను రానా పోషించిన విషయం, పోస్టర్ చూస్తే తెలుస్తోంది.

ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో రెజీనా హీరోయిన్‌గా నటించింది. సత్యరాజ్, నాజర్, ఆర్జే బాలాజీ వంటి వారు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. సత్య కెమెరామెన్‌గా, గోపీ కృష్ణ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

First Published:  9 Dec 2021 2:15 PM IST
Next Story