Telugu Global
Cinema & Entertainment

పుకార్లు ఖండించిన నాగచైతన్య

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే మూవీ చేస్తున్నాడు నాగచైతన్య. ఈ సినిమాపై నిన్నట్నుంచి పుకార్లు ఊపందుకున్నాయి. ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారని, అమెజాన్ నుంచి ఈ మేరకు భారీ ఆఫర్ వచ్చిందని ప్రచారం మొదలైంది. దీనిపై యూనిట్ స్పందించింది. థాంక్యూ సినిమాను థియేటర్లలోనే ముందుగా రిలీజ్ చేస్తామని మేకర్స్ స్పష్టంచేశారు. ప్రస్తుతం ఫైనల్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాను సరైన సమయం చూసి బిగ్ స్క్రీన్స్ పైనే విడుదల […]

పుకార్లు ఖండించిన నాగచైతన్య
X

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే మూవీ చేస్తున్నాడు నాగచైతన్య. ఈ సినిమాపై నిన్నట్నుంచి పుకార్లు ఊపందుకున్నాయి. ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారని, అమెజాన్ నుంచి ఈ మేరకు భారీ ఆఫర్ వచ్చిందని ప్రచారం మొదలైంది. దీనిపై యూనిట్ స్పందించింది.

థాంక్యూ సినిమాను థియేటర్లలోనే ముందుగా రిలీజ్ చేస్తామని మేకర్స్ స్పష్టంచేశారు. ప్రస్తుతం ఫైనల్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాను సరైన సమయం చూసి బిగ్ స్క్రీన్స్ పైనే విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత మాత్రమే ఇది ఓటీటీలోకి వస్తుందని క్లారిటీ ఇచ్చాడు.

ఇంతకుముందు V అనే సినిమాను నేరుగా ఓటీటీకి ఇచ్చేశాడు దిల్ రాజు. దీంతో థాంక్యూ సినిమాను కూడా ఓటీటీకి ఇచ్చేశాడంటూ పుకార్లు మొదలయ్యాయి. ఈసారి మాత్రం దిల్ రాజు అలాంటి పుకార్లకు తావివ్వలేదు. వెంటనే ప్రకటన ఇచ్చి రూమర్లు ఖండించాడు.

రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా మూవీ నుంచి నాగచైతన్య లుక్ ను రివీల్ చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోంది థాంక్యూ మూవీ.

First Published:  8 Dec 2021 8:08 AM IST
Next Story