పారితోషికం పెంచిన అఖండ హీరోయిన్
హిట్ వస్తే పారితోషికం పెంచడం చాలా కామన్. హీరోలు మాత్రమే కాదు, హీరోయిన్లు కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ప్రగ్యా జైశ్వాల్ టైమ్ వచ్చింది. ఈ అమ్మడు తాజాగా తన రెమ్యూనరేషన్ పెంచింది. ఇకపై చేయబోయే సినిమాలకు కోటి రూపాయలు డిమాండ్ చేస్తోందట. అఖండ సినిమాలో బాలయ్య సరసన నటించింది ప్రగ్యాజైశ్వాల్. ఆ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇప్పుడా సక్సెస్ ను క్యాష్ చేసుకునే పనిలో పడింది ముద్దుగుమ్మ. తన దగ్గరకు వచ్చిన […]
హిట్ వస్తే పారితోషికం పెంచడం చాలా కామన్. హీరోలు మాత్రమే కాదు, హీరోయిన్లు కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ప్రగ్యా జైశ్వాల్ టైమ్ వచ్చింది. ఈ అమ్మడు తాజాగా తన రెమ్యూనరేషన్ పెంచింది. ఇకపై చేయబోయే సినిమాలకు కోటి రూపాయలు డిమాండ్ చేస్తోందట.
అఖండ సినిమాలో బాలయ్య సరసన నటించింది ప్రగ్యాజైశ్వాల్. ఆ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇప్పుడా సక్సెస్ ను క్యాష్ చేసుకునే పనిలో పడింది ముద్దుగుమ్మ. తన దగ్గరకు వచ్చిన మేకర్స్ కు కోటి రూపాయల రెమ్యూనరేషన్ చెబుతోంది.
నిజానికి హీరోయిన్లకు కోటి రెమ్యూనరేషన్ పెద్ద విషయం కాదు. సమంత, అనుష్క, నయనతార, పూజాహెగ్డే, రష్మిక లాంటి హీరోయిన్లు ఎప్పుడో కోటి మార్క్ దాటేశారు. కానీ ప్రగ్యాజైశ్వాల్ మాత్రం సరైన సక్సెస్ లేక ఇన్నాళ్లూ కోటి కంటే తక్కువగా పారితోషికం తీసుకుంటూ వస్తోంది. ఎట్టకేలకు అఖండ రూపంలో ఇప్పుడు ప్రగ్యా టైమ్ స్టార్ట్ అయింది. ఇదే ఊపులో ఇంకొక్క హిట్ తగిలితే, ఈ ముద్దుగుమ్మ 2 కోట్ల మార్క్ టచ్ చేయడం ఖాయం.