Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ వరల్డ్ క్లాస్ గెస్ట్ హౌజ్

ఖాళీ దొరికితే హీరోలంతా విహారయాత్రలకు వెళ్లేందుకు ఇష్టపడతారు. విదేశాలు చుట్టేయాలని అనుకుంటారు. కానీ ప్రభాస్ మాత్రం ఇంట్లో సేదతీరాలని కోరుకుంటాడు. బయట తిరగడం, దేశాలు చుట్టేయడం ప్రభాస్ కు పెద్దగా నచ్చదు. ఈ క్రమంలో తన కోసం, ఫ్రీ-టైమ్ లో మరింత ప్రశాంతంగా ఉండడం కోసం ఓ భారీ గెస్ట్ హౌజ్ నిర్మించుకోవాలని భావిస్తున్నాడు ప్రభాస్. హైదరాబాద్ నానక్ రామ్ గూడలో ప్రభాస్ కు పెద్ద స్థలం ఉంది. 2 ఎకరాల ఆ స్థలంపై మొన్నటివరకు న్యాయపోరాటం […]

ప్రభాస్ వరల్డ్ క్లాస్ గెస్ట్ హౌజ్
X

ఖాళీ దొరికితే హీరోలంతా విహారయాత్రలకు వెళ్లేందుకు ఇష్టపడతారు. విదేశాలు చుట్టేయాలని అనుకుంటారు. కానీ ప్రభాస్ మాత్రం ఇంట్లో సేదతీరాలని కోరుకుంటాడు. బయట తిరగడం, దేశాలు చుట్టేయడం ప్రభాస్ కు పెద్దగా నచ్చదు. ఈ క్రమంలో తన కోసం, ఫ్రీ-టైమ్ లో మరింత ప్రశాంతంగా ఉండడం కోసం ఓ భారీ గెస్ట్ హౌజ్ నిర్మించుకోవాలని భావిస్తున్నాడు ప్రభాస్.

హైదరాబాద్ నానక్ రామ్ గూడలో ప్రభాస్ కు పెద్ద స్థలం ఉంది. 2 ఎకరాల ఆ స్థలంపై మొన్నటివరకు న్యాయపోరాటం నడిచింది. అది ప్రభుత్వానికి చెందిన స్థలం అంటూ అధికారులు కోర్టులో కేసు వేశారు. కానీ ప్రభాస్ ఆ స్థలాన్ని 12 ఏళ్ల కిందటే తీసుకున్నాడు. ఎట్టకేలకు ఆ స్థలం గొడవ క్లియర్ అయింది. సదరు స్థలం ప్రభాస్ కే చెందుతుందని కోర్టు తీర్పునిచ్చింది.

ఇప్పుడు అదే స్థలంలో భారీ గెస్ట్ హౌజ్ నిర్మించాలని భావిస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం అక్కడున్న ఫామ్ హౌజ్ ను కూల్చేసి, ఆ స్థానంలో గెస్ట్ హౌజ్ ను కట్టాలనుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే ఓ చిన్న ఫైవ్ స్టార్ హోటల్ లో ఉండే సదుపాయలన్నీ ఈ గెస్ట్ హౌజ్ లో ఉండబోతున్నాయి. ముంబయికి చెందిన ఓ కనస్ట్రక్షన్ కంపెనీ, ఈ గెస్ట్ హౌజ్ ను నిర్మించబోతోంది. ఈ నిర్మాణం కోసం 80 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నాడట ప్రభాస్.

First Published:  8 Dec 2021 8:15 AM IST
Next Story