Telugu Global
National

దేశంలో మొట్టమొదటి ఈ-ఆఫీస్ జిల్లా ఏదో తెలుసా..?

ఆ జిల్లాలో అన్నీ ఆన్ లైన్లోనే ఉంటాయి. మారుమూల ఏ పల్లెటూరిలో ఏ చిన్న అర్జీ వచ్చినా వెంటనే డిజిటల్ ఫార్మేట్ లోకి మారిపోతుంది, ఆన్ లైన్లోకి ఎక్కేస్తుంది. ఆ అర్జీ ఏస్టేజ్ లో ఉంది, దాన్ని ఎవరు పరిష్కరించాలి, ఎన్నిరోజుల్లో పరిష్కారం అవుతుంది.. ఇలాంటి విషయాలన్నీ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటాయి. అప్లికేషన్ నెంబర్ టైప్ చేస్తే చాలు దాని వివరాలన్నీ మనకు తెలుస్తాయి. ఫైల్స్ మిస్ అయ్యాయి, తడిచిపోయాయి, చెదలుపట్టాయి, ఆఫీస్ లో అగ్ని […]

దేశంలో మొట్టమొదటి ఈ-ఆఫీస్ జిల్లా ఏదో తెలుసా..?
X

ఆ జిల్లాలో అన్నీ ఆన్ లైన్లోనే ఉంటాయి. మారుమూల ఏ పల్లెటూరిలో ఏ చిన్న అర్జీ వచ్చినా వెంటనే డిజిటల్ ఫార్మేట్ లోకి మారిపోతుంది, ఆన్ లైన్లోకి ఎక్కేస్తుంది. ఆ అర్జీ ఏస్టేజ్ లో ఉంది, దాన్ని ఎవరు పరిష్కరించాలి, ఎన్నిరోజుల్లో పరిష్కారం అవుతుంది.. ఇలాంటి విషయాలన్నీ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటాయి. అప్లికేషన్ నెంబర్ టైప్ చేస్తే చాలు దాని వివరాలన్నీ మనకు తెలుస్తాయి. ఫైల్స్ మిస్ అయ్యాయి, తడిచిపోయాయి, చెదలుపట్టాయి, ఆఫీస్ లో అగ్ని ప్రమాదం జరిగింది.. అనే సమస్యే ఉండదు. జిల్లా మొత్తం ఈ-ఆఫీస్ వ్యవస్థను పగడ్బందీగా నడుపుతూ అరుదైన రికార్డ్ సాధించారు అధికారులు. కేరళలోని వయనాడ్ జిల్లా దేశంలోనే తొట్టతొలి ఈ-ఆఫీస్ జిల్లాగా ఘనతకెక్కింది.

దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ఆఫీస్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎక్కడో ఒకచోట ఏదో ఒక ఆఫీస్ లో కొరత కనిపిస్తుంది. మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సదుపాయం లేక, అలాంటి వాటిని అనుసంధానించడం కష్టమవుతుంది. కానీ కేరళలోని వయనాడ్ లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. మొత్తం 60లక్షల రూపాయల ఖర్చుతో ఈ-ఆఫీస్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించారు. మారుమూల ప్రాంతాల్లోని ఆఫీస్ లకు ఇంటర్నెట్ సౌకర్యం తీసుకెళ్లడమే ఇక్కడ ప్రధాన ప్రతిబంధకంగా మారింది. బీఎస్ఎన్ఎల్ సంస్థ అందించే ఫైబర్ టు ద హోమ్ (FTTH) ద్వారా దీన్ని అధిగమించారు.

వయనాడ్ జిల్లా మొత్తం ఇప్పుడు ఒకటే సర్వర్ తో అనుసంధానమై పనిచేస్తుంది. 2015లో ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించగా, రెండేళ్లలో కలెక్టరేట్, సబ్ కలెక్టరేట్ ఆఫీస్ ల పరిధిలో డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాతి ఏడాది, తాలూకా ఆఫీసుల్లో కూడా ఈ సేవలను ప్రవేశపెట్టారు. పాత ఫైల్స్ మొత్తం డిజిటల్ ఫార్మేట్ లోకి మార్చేశారు. ఇప్పటి వరకు మొత్తం 1,03,932 ఫైల్స్ ని డిజిటల్ రూపంలోకి మార్చేశారు. దీనివల్ల లాక్ డౌన్ సమయంలో కూడా రెవెన్యూ ఉద్యోగుల పని చాలా సులభమైందని చెబుతారు ఉన్నతాధికారులు. గ్రామస్తులకు ఎక్కడా ఎలాంటి సేవలకు ఆటంకం కలగలేదని అంటున్నారు. జిల్లా కలెక్టర్ గీత ఈ విషయంలో చొరవ చూపి ఈ-ఆఫీస్ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. దేశంలోనే వయనాడ్ కి అరుదైన గుర్తింపు తీసుకొచ్చారు.

First Published:  7 Dec 2021 12:12 PM IST
Next Story