Telugu Global
National

తమిళం నేర్చుకోకపోతే ప్రభుత్వ ఉద్యోగం రాదు..

తమిళనాడు ప్రజలకు, ప్రభుత్వానికి భాషాభిమానం ఎక్కువ. జాతీయ భాష హిందీకి కూడా అందుకే అక్కడ ఆదరణ తక్కువ. ఇప్పటికీ తమిళనాడులో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు ఎక్కువగా తమిళంలోనే జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది స్టాలిన్ సర్కారు. తమిళ్ లో పాస్ కావాల్సిందే.. పోటీ పరీక్షల్లో ఇప్పటి వరకూ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్.. ఇలాంటి విభాగాలుండేవి. ఇకపై తమిళ్ లాంగ్వేజ్ స్కిల్స్ అనేది […]

తమిళం నేర్చుకోకపోతే ప్రభుత్వ ఉద్యోగం రాదు..
X

తమిళనాడు ప్రజలకు, ప్రభుత్వానికి భాషాభిమానం ఎక్కువ. జాతీయ భాష హిందీకి కూడా అందుకే అక్కడ ఆదరణ తక్కువ. ఇప్పటికీ తమిళనాడులో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు ఎక్కువగా తమిళంలోనే జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది స్టాలిన్ సర్కారు.

తమిళ్ లో పాస్ కావాల్సిందే..
పోటీ పరీక్షల్లో ఇప్పటి వరకూ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్.. ఇలాంటి విభాగాలుండేవి. ఇకపై తమిళ్ లాంగ్వేజ్ స్కిల్స్ అనేది అక్కడ అదనంగా చేరుతుంది. తమిళ భాషా పరిజ్ఞానాన్ని పరీక్షించి, పాసైనవారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలంటూ ప్రభుత్వం ప్రకటించింది. పోటీ పరీక్షల్లోని ఇతర అంశాల్లో మెరుగైన మార్కులు సాధించినా తమిళ భాష పరీక్షలో కచ్చితంగా 40శాతం మార్కులు సాధించాల్సిందే. లేకపోతే అక్కడ ప్రభుత్వ ఉద్యోగం రాదు.

ఇంగ్లిష్ మీడియం పిల్లలకు కష్టమే..
ప్రభుత్వ స్కూళ్లలో తమిళ మీడియం అందుబాటులో ఉన్నా.. చాలా వరకు కార్పొరేట్ స్కూల్స్ లో ఇంగ్లిష్ మీడియం చదువులకే పిల్లలు అలవాటు పడ్డారు. అలాంటి వారందరికీ ఇప్పుడు ప్రభుత్వ కొలువులు దొరకడం కష్టంగా మారే అవకాశం ఉంది. ఉద్యోగం కావాలంటే.. ఇప్పుడు కొత్తగా తమిళ భాషపై పట్టుసాధించాల్సిందే. కులాంతర వివాహాలు చేసుకున్నవారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తామని ఇటీవలే ప్రకటించిన స్టాలిన్ ప్రభుత్వం.. కొత్తగా తమిళ భాషలో పట్టున్నవారికే ఉద్యోగాలంటూ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

కొత్త విధానంతో సామాజిక న్యాయం జరుగుతుందని, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్. ముందుగా తమిళ భాషా పేపర్‌ లో అర్హత సాధించినవారి పేపర్లు మాత్రమే మిగతా విభాగాల్లో కరెక్షన్ కి వెళ్తాయి. ఎంట్రన్స్ పరీక్షలో తొలి మెట్టులోనే ఫెయిలైతే.. ఇక వారి పేపర్ దిద్దాల్సిన అవసరం ఉండదు. ఇకపై విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లన్నిటిలో ఈ నిబంధన చేర్చుతామంటున్నారు మంత్రి త్యాగరాజన్. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నూతన నిర్ణయంపై ఆ రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భాషకు మరోసారి స్టాలిన్ పట్టం కట్టారని అంటున్నారు.

First Published:  6 Dec 2021 3:13 AM IST
Next Story