Telugu Global
Cinema & Entertainment

కొత్త సినిమా స్టార్ట్ చేసిన సమంత

సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రానికి ‘యశోద’ టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్‌తో సమంతకు జాతీయ స్థాయిలో పేరొచ్చింది. ఆమెకు క్రేజ్ ఏర్పడింది. తెలుగు, తమిళ సినిమాల్లో పోషించిన పాత్రలకు భిన్నమైన పాత్రను ఆ వెబ్ సిరీస్‌లో చేశారు. దాంతో సమంత పొటెన్షియల్ ఏమిటన్నది అందరికీ తెలిసింది. ప్రస్తుతం సమంతకు ఉన్న క్రేజ్‌కు […]

కొత్త సినిమా స్టార్ట్ చేసిన సమంత
X

సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రానికి ‘యశోద’ టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

‘ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్‌తో సమంతకు జాతీయ స్థాయిలో పేరొచ్చింది. ఆమెకు క్రేజ్ ఏర్పడింది. తెలుగు, తమిళ సినిమాల్లో పోషించిన పాత్రలకు భిన్నమైన పాత్రను ఆ వెబ్ సిరీస్‌లో చేశారు. దాంతో సమంత పొటెన్షియల్ ఏమిటన్నది అందరికీ తెలిసింది. ప్రస్తుతం సమంతకు ఉన్న క్రేజ్‌కు త‌గ్గ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్ర‌మిది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషలో తెరకెక్కిస్తున్నారు.

సమంత ప్రధాన పాత్రలో నిర్మిస్తున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రమిది. థ్రిల్లర్ జాన‌ర్‌లో నేషనల్ లెవ‌ల్‌లో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునే స్టోరీతో వస్తోంది యశోద. 4 నెలల్లో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేశాం. మార్చితో చిత్రీకరణ పూర్తవుతుంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

First Published:  6 Dec 2021 12:49 PM IST
Next Story