Telugu Global
Cinema & Entertainment

ఇది అనూప్ రూబెన్స్ మార్క్ సాంగ్

బంగార్రాజు ప్రమోషన్స్ ను మొదటి నుండి డిఫరెంట్ గా చేస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్, పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ లడ్డుండా ఇలా ప్రతీ ఒక్కదానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న బంగార్రాజు సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ‘నా కోసం’ లిరికల్ వీడియోను విడుదల చేశారు. తన ప్రేయసి కృతి […]

ఇది అనూప్ రూబెన్స్ మార్క్ సాంగ్
X

బంగార్రాజు ప్రమోషన్స్ ను మొదటి నుండి డిఫరెంట్ గా చేస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్, పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ లడ్డుండా ఇలా ప్రతీ ఒక్కదానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న బంగార్రాజు సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ‘నా కోసం’ లిరికల్ వీడియోను విడుదల చేశారు. తన ప్రేయసి కృతి శెట్టి కోసం నాగచైతన్య ఎంతలా తనని తాను మార్చుకున్నాడో ఈ పాటలో చెప్పారు. అనూప్ రూబెన్స్ మంచి మెలోడీ ట్యూన్‌ను అందించగా.. సిద్ శ్రీరామ్ గాత్రం అద్బుతంగా ఉంది. పాట మొత్తం అనూప్ రూబెన్స్ మార్క్ కనిపించింది.

నాగచైతన్య, కృతి శెట్టిల మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది. ఇక ఈ పాట చివర్లో నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టిలు కనిపించారు.

అక్కినేని కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే సినిమా మనం. అందులో నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోన్న ఈ ‘బంగార్రాజు’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం బంగార్రాజు షూటింగ్ జరుగుతోంది.

First Published:  6 Dec 2021 12:40 PM IST
Next Story