Telugu Global
Business

ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు ఫ్యూచర్ ఉందా? ఛార్జింగ్‌కు సొల్యూషన్ ఏది?

పెరిగిపోయిన పెట్రోల్ ధరలు, పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఇప్పుడు అందరూ ఎలక్ట్రిక్ వాహనాల బాట పడుతున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ ట్రెండ్ మున్ముందు ఎలా ఉండబోతోంది. అనుకున్న స్థాయిలో సక్సెస్ అవుతుందా? స్టడీలు ఏం చెప్తున్నాయో ఓసారి చూద్దాం.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగం ప్రోత్సహించాలని అన్నిదేశాల ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను రిలీజ్ చేశాయి. ఒకప్పటిలా కాకుండా అత్యంత ప్రీమియం ఫీచర్లతో రకరకాల వేరియంట్లతో ఎలక్ట్రిక్ కార్లు, బైకులు అందుబాటులో […]

ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు ఫ్యూచర్ ఉందా? ఛార్జింగ్‌కు సొల్యూషన్ ఏది?
X

పెరిగిపోయిన పెట్రోల్ ధరలు, పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఇప్పుడు అందరూ ఎలక్ట్రిక్ వాహనాల బాట పడుతున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ ట్రెండ్ మున్ముందు ఎలా ఉండబోతోంది. అనుకున్న స్థాయిలో సక్సెస్ అవుతుందా? స్టడీలు ఏం చెప్తున్నాయో ఓసారి చూద్దాం..

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగం ప్రోత్సహించాలని అన్నిదేశాల ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను రిలీజ్ చేశాయి. ఒకప్పటిలా కాకుండా అత్యంత ప్రీమియం ఫీచర్లతో రకరకాల వేరియంట్లతో ఎలక్ట్రిక్ కార్లు, బైకులు అందుబాటులో ఉన్నాయి.

ప్రాబ్లమ్ ఇదే
గత కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే ప్రతి ఏటా వీటి కొనుగోళ్ల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. అయితే అందరూ ఎలక్ట్రిక్ వైపు చూడకపోవడానికి కారణం వీటి రీఛార్జ్ ప్రాసెస్. పెడితే ఇంట్లో ఛార్జింగ్ పెట్టాలి. లేదా ఆగిపోతే తోసుకుంటూ రావాలి. మధ్యలో ఛార్జ్ చేయడానికి అవకాశాలు తక్కువ. ఇదొక్కటే ఎలక్ట్రిక్ వాహనాల సక్సెస్ కు అడ్డొస్తుంది. అందుకే ఇప్పుడు అందరూ ఎలక్ట్రిక్ ఫిల్లింగ్ స్టేషన్ల ఏర్పాటుపై ఫోకస్ పెట్టారు.

సరికొత్త టెక్నాలజీ
ప్రస్తుతం భూమి వేడెక్కుతున్న పరిస్థితి చూస్తుంటే ఎప్పటికైనా అందరూ ఎలక్ట్రిక్ వాహనాలకు మారక తప్పదు. అయితే దీనికోసం కొన్ని ప్రత్యేకమైన డెవలప్ మెంట్స్ చేయాలి. ఎలక్ట్రిక్ వాహనాలకోసం ఫ్యూచర్లో ప్రత్యేకంగా రహదారులను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు సైంటిస్టులు. ఇండక్టివ్ ఛార్జింగ్ అనే టెక్నాలజీ ద్వారా కారు రోడ్డు మీద వెళ్తున్నంతసేపూ ఛార్జ్ అవుతూనే ఉంటుంది. దీన్ని వైర్‌లెస్ ఛార్జింగ్ కాంక్రీట్ హైవేస్ అంటారు.

ఛార్జింగ్ ఇలా..
ఈ హైవేస్ కోసం మ్యాగ్నెటిక్ కాంక్రీటును వాడతారు. అందులో ఐరన్ ఆక్సైడ్, నికెల్, జింక్ వంటి లోహ మూలకాలు ఉంటాయి. ఇది మొబైల్ ఫోన్‌ వైర్‌లెస్‌గా ఛార్జర్ లాగా రోడ్డుపై వెళ్తున్న కారుని ఛార్జ్ చేస్తుంది. ఫ్యూచర్ లో అన్ని రోడ్లు ఈ టెక్నాలజీకి అప్ డేట్ చేస్తే ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే వాడొచ్చని, కార్బన్ ఫుట్ ప్రింట్స్ ను గణనీయంగా తగ్గించొచ్చని నిపుణులు చెప్తున్నారు. మరి ఈ టెక్నాలజీ ఎంతవరకూ సక్సెస్ అవుతుందో… ఎప్పటికి పూర్తవుతుందో వేచి చూడాల్సిందే..

First Published:  3 Dec 2021 11:57 AM IST
Next Story