Telugu Global
National

సుప్రీం చీవాట్లతో ఢిల్లీలో స్కూళ్లకు మళ్లీ తాళం..

వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలనివ్వలేదు. ఎన్ని నిబంధనలు తీసుకొచ్చినా చివరకు కాలుష్య కారకాలను మాత్రం తగ్గించలేకపోతోంది. దీంతో పదే పదే సుప్రీంకోర్టుతో చీవాట్లు తినాల్సి వస్తోంది ఢిల్లీ సర్కారు. గతంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రైతులు వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడం వల్లే రాజధానిపై కాలుష్య మేఘం కమ్ముకుంటోందనే వాదన ఉంది. దీన్ని పూర్తిగా కొట్టిపారేసిన సుప్రీంకోర్టు.. ఇతర విషయాలపై దృష్టిపెట్టాలని ఢిల్లీ ప్రభుత్వానికి మొట్టికాయ వేసింది. దీంతో రాజధానిలో భవన నిర్మాణ […]

సుప్రీం చీవాట్లతో ఢిల్లీలో స్కూళ్లకు మళ్లీ తాళం..
X

వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలనివ్వలేదు. ఎన్ని నిబంధనలు తీసుకొచ్చినా చివరకు కాలుష్య కారకాలను మాత్రం తగ్గించలేకపోతోంది. దీంతో పదే పదే సుప్రీంకోర్టుతో చీవాట్లు తినాల్సి వస్తోంది ఢిల్లీ సర్కారు. గతంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రైతులు వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడం వల్లే రాజధానిపై కాలుష్య మేఘం కమ్ముకుంటోందనే వాదన ఉంది. దీన్ని పూర్తిగా కొట్టిపారేసిన సుప్రీంకోర్టు.. ఇతర విషయాలపై దృష్టిపెట్టాలని ఢిల్లీ ప్రభుత్వానికి మొట్టికాయ వేసింది. దీంతో రాజధానిలో భవన నిర్మాణ పనుల్ని పూర్తిగా నిషేధించింది ఢిల్లీ ప్రభుత్వం. పెద్ద పెద్ద ట్రక్కులు ఢిల్లీలోకి రాకూడదని ఆంక్షలు పెట్టింది. కొన్నిరోజులపాటు ఆఫీస్ లకు, స్కూళ్లకు కూడా సెలవలు ప్రకటించింది. అయితే తాజాగా సోమవారం నుంచి స్కూళ్లకు వెసులుబాటు ఇచ్చింది ప్రభుత్వం.

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తగ్గకపోయినా ప్రభుత్వం స్కూళ్లను తెరిచేలా నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు కొత్త విమర్శలకు దారితీసింది. తల్లిదండ్రులు ఆఫీస్ లకు వెళ్లకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటే.. పిల్లలు మాత్రం స్కూళ్లకు ఎందుకు వెళ్లాలని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. తాజాగా వాతావరణ కాలుష్యంపై మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వ చర్యలపై అభ్యంతరం తెలిపింది. సమయం వృథా అవుతుంది కానీ, ఫలితం లేదని, కాలుష్యం పెరుగుతూనే ఉందని ప్రభుత్వానికి తెలిపింది. పరిశ్రమలు, వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

స్కూళ్లకు నిరవధిక సెలవలు..
సుప్రీం ఆదేశాలతో ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లను మూసివేసేందుకు తాజాగా నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి ఢిల్లీలో స్కూళ్లకు తాళం వేస్తున్నట్టు ప్రకటించింది. గాలి నాణ్యత మెరుగుపడుతుందనే ఉద్దేశంతోనే స్కూళ్లను తిరిగి తెరిచామని, అయితే ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవని, అందుకే మళ్లీ స్కూళ్లకు సెలవలు ప్రకటిస్తున్నట్టు తెలిపింది. అయితే ఈసారి గడువు మాత్రం చెప్పలేదు. తదుపరి ఆదేశాలిచ్చే వరకు స్కూళ్లకు సెలవలు కొనసాగించాలని తెలిపింది ప్రభుత్వం.

First Published:  2 Dec 2021 2:22 PM IST
Next Story