అప్‌డేట్ అయిన ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలివే..
ఎయిర్ టెల్ ఉన్నట్టుండి ప్రీపెయిన్ ప్లాన్ల ధరలు పెంచేయడంతో మిగిలిన టెలికాం కంపెనీలు కూడా అదే బాట పట్టాయి. ఇప్పుడు అన్ని ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఏయే కంపెనీల్లో ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయంటే.. ఇండియాలో 5G టెక్నాలజీ తీసుకొచ్చేందుకు ఎయిర్ టెల్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ తమ టారిఫ్ ప్లాన్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. దాంతో పాటు వొడాఫోన్ ఐడియా, జియో నెట్వర్క్ లు కూడా ధరలు పెంచేశాయి. ఎయిర్ టెల్ ఎయిర్‌టెల్ […]
ఎయిర్ టెల్ ఉన్నట్టుండి ప్రీపెయిన్ ప్లాన్ల ధరలు పెంచేయడంతో మిగిలిన టెలికాం కంపెనీలు కూడా అదే బాట పట్టాయి. ఇప్పుడు అన్ని ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఏయే కంపెనీల్లో ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయంటే..
ఇండియాలో 5G టెక్నాలజీ తీసుకొచ్చేందుకు ఎయిర్ టెల్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ తమ టారిఫ్ ప్లాన్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. దాంతో పాటు వొడాఫోన్ ఐడియా, జియో నెట్వర్క్ లు కూడా ధరలు పెంచేశాయి.
ఎయిర్ టెల్
ఎయిర్‌టెల్ రూ.79 ప్లాన్ కాస్తా రూ.99కు పెంచింది. (28 రోజుల వ్యాలిడిటీ, 200MB డేటా)
రూ.149 ప్లాన్.. రూ.179కి పెంచింది. (28 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్, 2GB డేటా)
రూ.219 ప్లాన్‌ను రూ.265కి పెంచింది. (28 రోజుల వ్యాలిడిటీ, ప్రతిరోజూ 1GB డేటా)
రూ.249 ప్లాన్ ను రూ.299కి పెంచింది. (28 రోజుల వ్యాలిడిటీ, రోజూ 1.5GB డేటా)
రూ.449 ప్లాన్‌ను రూ.549 వరకు పెంచింది. ( 56 రోజుల వ్యాలిడిటీ, రోజూ 2GB డేటా)
రూ.379 ప్లాన్‌ను రూ.455కి పెంచింది. (84 రోజుల వ్యాలిడిటీ, 6GB డేటా)
రూ.698 ప్లాన్‌ను రూ.839కి పెంచింది. ( 84 రోజుల వ్యాలిడిటీ, రోజూ 2GB డేటా)
రూ.1498 యాన్యువల్ ప్లాన్ ను రూ.1799కి పెంచింది. (365 రోజుల వ్యాలిడిటీ, మొత్తం 24GB డేటా)
రూ.2498 యాన్యువల్ ప్లాన్‌ను రూ.2999కి పెంచింది. (365 రోజుల వ్యాలిడిటీ, రోజూ 2జీబీ డేటా)
వొడాఫోన్ ఐడియా
వోడాఫోన్ ఐడియాలో ఉండే రూ. 149 ప్లాన్.. ఇప్పటినుంచి రూ. 179 ఉంటుంది. అలాగే రూ. 219 ప్లాన్ ను రూ. 269 పెరిగింది. అలాగే రూ.249 ప్లాన్ ను రూ. 299కు, రూ.299 ప్లాన్ ను రూ.359కు పెంచేసింది. రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ. 839కి పెరిగింది.
ఇకపోతే 365 రోజుల వ్యాలిడిటీ కలిగిన వార్షిక ప్లాన్ రూ. 1,499 ప్లాన్ ను రూ. 1,799 కు, రూ. 2,399 ప్లాన్ ను రూ. 2,899 కు పెంచింది.
జియో
జియోలో ఉండే రూ.129 ప్లాన్ రూ.155కి, రూ.149 ప్లాన్ ధర రూ.179కి, రూ.199 ప్లాన్ ధర రూ.239కి, రూ.249 ప్లాన్ ధర రూ.299కి, రూ.399 ప్లాన్ ధర రూ.479కి పెరిగింది.
వార్షిక ప్లాన్స్ అయిన రూ.1,299 ప్లాన్ ధర రూ.1,559కి, రూ.2,399 ప్లాన్ ధర రూ.2,879కి పెరిగింది.