Telugu Global
Cinema & Entertainment

'స్కైలాబ్'లో కామెడీ

మరో 3 రోజుల్లో విడుదలకాబోతున్న స్కైలాబ్ సినిమాను ప్రయోగాత్మక చిత్రంగా చూడొద్దంటున్నాడు హీరో సత్యదేవ్. ఇదొక పక్కా కామెడీ చిత్రం అంటున్నాడు. సరదాగా నవ్వుకునేలా సినిమా ఉంటుందని చెబుతున్నాడు. “స్కై లాబ్ ప‌డిపోతుంద‌ని, ఓ ప‌ర్టికుల‌ర్ గ్రామం నాశ‌న‌మైపోతుంద‌నే వార్త బ‌య‌ట‌కు రావ‌డంతో.. అప్ప‌ట్లో అంద‌రూ భ‌య‌ప‌డ్డారు. ప‌ర్టికుల‌ర్ ప్రాంతంలోని వారు చ‌నిపోతామ‌ని భావించారు. కోళ్లు, మేక‌లు కోసుకుని తినేశారు. ఇంకేం ఉండ‌దు అని భావించారు. నేను విన్న దాని ప్ర‌కారం కొంద‌రైతే బంగారు నాణెల‌ను మింగేశార‌ని, […]

స్కైలాబ్లో కామెడీ
X

మరో 3 రోజుల్లో విడుదలకాబోతున్న స్కైలాబ్ సినిమాను ప్రయోగాత్మక చిత్రంగా చూడొద్దంటున్నాడు హీరో సత్యదేవ్. ఇదొక పక్కా కామెడీ చిత్రం అంటున్నాడు. సరదాగా నవ్వుకునేలా సినిమా ఉంటుందని చెబుతున్నాడు.

“స్కై లాబ్ ప‌డిపోతుంద‌ని, ఓ ప‌ర్టికుల‌ర్ గ్రామం నాశ‌న‌మైపోతుంద‌నే వార్త బ‌య‌ట‌కు రావ‌డంతో.. అప్ప‌ట్లో అంద‌రూ భ‌య‌ప‌డ్డారు. ప‌ర్టికుల‌ర్ ప్రాంతంలోని వారు చ‌నిపోతామ‌ని భావించారు. కోళ్లు, మేక‌లు కోసుకుని తినేశారు. ఇంకేం ఉండ‌దు అని భావించారు. నేను విన్న దాని ప్ర‌కారం కొంద‌రైతే బంగారు నాణెల‌ను మింగేశార‌ని, కొంద‌రు ఆస్తులు అమ్ముకుని వెళ్లిపోయార‌ని ఇలా చాలా చాలా జ‌రిగాయి. గౌరి, ఆనంద్‌, సుబేదార్ రామారావు అనే మూడు ప్ర‌ధాన పాత్ర‌లు వీటితో పాటు స్కై లాబ్‌… బండ లింగ‌ప‌ల్లిలోని ప్ర‌జ‌లు చుట్టూ క‌థ తిరుగుతుంది. అంద‌రి మ‌ధ్య కామెడీగా సాగే సినిమా ఇది”

ఇలా స్కైలాబ్ సినిమాపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు సత్యదేవ్. అంతేకాదు.. ఈ సినిమాలో తను, హీరోయిన్ నిత్యామీనన్ అస్సలు కలుసుకోమని కూడా బయటపెట్టాడు. ఎవరి పాత్రలు వారివేనని, తెరపై తామిద్దరి మధ్య ఒక్క సీన్ కూడా ఉండదని అన్నాడు. 4వ తేదీ థియేటర్లలోకి వస్తోంది స్కైలాబ్ సినిమా.

First Published:  1 Dec 2021 2:32 PM IST
Next Story